'నేతాజీ జీవించి ఉంటే భారతదేశం ఎప్పటికీ విడిపోయేది కాదు'

Published : Jun 18, 2023, 05:49 AM IST
'నేతాజీ జీవించి ఉంటే భారతదేశం ఎప్పటికీ విడిపోయేది కాదు'

సారాంశం

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ..తన పోరాటాన్ని ప్రారంభించారని NSA అజిత్ దోవల్ అన్నారు. నేతాజీకి జపాన్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. నేతాజీ బతికి ఉంటే భారత్ అసలు విడిపోయి ఉండేది కాదని అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవించి ఉండి  ఉంటే భారతదేశ విభజన జరిగేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ అన్నారు. ప్రముఖ వాణిజ్య సంస్థ ఆసోచామ్‌ ఆధ్వర్యంలో శనివారం (జూన్ 17) ఢిల్లీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెమోరియల్‌లో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్ దోవల్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన దేశ విభజన గురించి.. నేతాజీ వ్యక్తిత్వం గురించి చాలా మాట్లాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే భారతదేశ విభజన జరిగేది కాదని పేర్కొన్నారు.

"నేతాజీ తన జీవితంలో చాలాసార్లు ధైర్యం చూపించారు. మహాత్మా గాంధీని కూడా సవాలు చేసే ధైర్యం కూడా ఆయనకు ఉంది" అని ఆయన అన్నారు. "అయితే అప్పుడు మహాత్మా గాంధీ తన రాజకీయ గురువుగా భావించారనీ, కానీ అతడి అభిప్రాయాలను నచ్చక బోస్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టారని అన్నారు. భారతీయ చరిత్రకు, ప్రపంచ చరిత్రకు చెందిన ఇలాంటి వ్యక్తుల మధ్య చాలా తక్కువ సారూప్యతలు ఉన్నాయని, నేతాజీకి ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రవహించే ధైర్యం ఉందని, అలా చేయడం అంత సులభం కాదని ఆయన అన్నారు.

 నేతాజీకి జపాన్ మద్దతు 

నేతాజీ ఒక్కరే  ఉన్నారని, ఆయనకు జపాన్ తప్ప మద్దతిచ్చే దేశం లేదని దోవల్ అన్నారు. భారత దేశానికి పూర్తి  స్వాతంత్ర్యం కావాలని కోరుకున్నారనీ, అందుకు కోసమే పోరాటాలు సాగించారని తెలిపారు.ఈ దేశాన్ని రాజకీయ అణిచివేత నుండి విముక్తి చేయడమే కాకుండా, ప్రజల రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక ఆలోచనలను మార్చాల్సిన అవసరం ఉందని  భావించాలని ఆయన అన్నారు. "నేను బ్రిటిష్ వారితో పోరాడతాను, నేను స్వాతంత్ర్యం కోసం యాచించను, ఇది నా హక్కు మరియు నేను దానిని కలిగి ఉంటాను" అనే ఆలోచన నేతాజీ మనస్సులో వచ్చిందనీ,సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే.. భారతదేశ విభజన జరిగేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?