పంజాబ్ కీలక నిర్ణయం: వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుంచి మోడీ ఫోటో తొలగింపు

By Siva KodatiFirst Published May 26, 2021, 3:00 PM IST
Highlights

కొవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ చిత్రాన్ని పంజాబ్ ప్రభుత్వం తొలగించింది.18-44 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా డిజిటల్ కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో మోడీ ఫొటోను పంజాబ్ తీసివేసింది

కొవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ చిత్రాన్ని పంజాబ్ ప్రభుత్వం తొలగించింది.18-44 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా డిజిటల్ కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో మోడీ ఫొటోను పంజాబ్ తీసివేసింది. గతంలో జార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని చిత్రాన్ని తొలగించాయి. పంజాబ్‌లో భవన నిర్మాణ కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. 

Also Read:కరోనాతో ప్రపంచమంతా మారిపోయింది: మోడీ

టీకాలు తీసుకున్న వారికి కేంద్రం విడుదల చేసిన కోవిన్ యాప్ బదులు పంజాబ్ కోవా యాప్ లో ప్రధాని మోడీ చిత్రం లేకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ప్రధాని చిత్రంతో పాటు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చిత్రాన్ని కూడా సర్టిఫికెట్లలో చేర్చ లేదు. ఎవరి చిత్రాలు లేకుండా నే టీకా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు అధికారలు వెల్లడించారు. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రూ.1,000 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. 

click me!