వైరల్ : కరోనాతో చనిపోయిన కూతురు.. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లిన తండ్రి... !

By AN TeluguFirst Published May 26, 2021, 2:52 PM IST
Highlights

ఓ వైపు మహమ్మారి ప్రాణాలు తోడేస్తుంటే మరోవైపు.. ప్రైవేట్ ఆసుపత్రులు, అంబులెన్స్ ను ఫీజుల పేరుతో తేరుకోలేని దెబ్బ కొడుతున్నాయి. అమానుషంగా ప్రవర్తిస్తూ మానవత్వం లేదని నిరూపిస్తున్నాయి. అలాంటి ఓ అమానుష ఘటనే రాజస్థాన్ లో జరిగింది. 

ఓ వైపు మహమ్మారి ప్రాణాలు తోడేస్తుంటే మరోవైపు.. ప్రైవేట్ ఆసుపత్రులు, అంబులెన్స్ ను ఫీజుల పేరుతో తేరుకోలేని దెబ్బ కొడుతున్నాయి. అమానుషంగా ప్రవర్తిస్తూ మానవత్వం లేదని నిరూపిస్తున్నాయి. అలాంటి ఓ అమానుష ఘటనే రాజస్థాన్ లో జరిగింది. 

అంబులెన్స్ డ్రైవర్ల డిమాండ్లకు తలొగ్గలేక.. ఓ వ్యక్తి తన ప్రాణాల్నే ఫణంగా పెట్టాడు.. వివరాల్లోకి వెడితే.. 

కరోనా పాజిటివ్ తో చనిపోయిన కుమార్తె మృతదేహాన్ని ఓ తండ్రి కారులో 85 కిలోమీటర్లు తీసుకువెళ్లిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటనలో అంబులెన్స్ కు కావాల్సిన మొత్తం చెల్లించలేక ఓ తండ్రి ఈ సాహసానికి ఒడిగట్టాడు. 

రాజస్థాన్ లోని ఝలావార్ గ్రామానికి చెందిన సీమా అనే యువతికి కరోనా బారిన పడింది. దీంతో ఆమెను కోట పట్టణంలోని ఆస్పత్రిలో చేర్పించాడు తండ్రి. కాగా చికిత్స పొందుతూ సీమ మరణించింది. దీంతో సీమ మృతదేహాన్ని తన స్వగ్రామానికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్లను మృతురాలి తండ్రి సంప్రదించాడు. 

అయితే 85 కి.మీ. దూరం వెళ్లే ప్రయాణానికి అంబులెన్స్ కు రూ. 35 వేలు డిమాండ్ చేశారు. ఎంత అడిగినా వారు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేం లేక.. అంత డబ్బులు పెట్టలేక కుమార్తె మృతదేహాన్ని తన కారులో సీటు బెల్టుతో కట్టి.. తానే డ్రైవింగ్ చేస్తూ తన ఘలావార్ గ్రామానికి తీసుకువెళ్లారు.

ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోటా జిల్లా కలెక్టర్ దర్యాప్తుకు ఆదేశించారు. ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్ల వివరాలు ఇవ్వమని సీమ తండ్రిని అధికారులు అడిగారు. 

click me!