Andrapradesh Capital Issue : ఇప్పుడు అమరావతే రాజధాని.. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్...

Published : Feb 03, 2022, 08:01 AM IST
Andrapradesh Capital Issue : ఇప్పుడు అమరావతే రాజధాని.. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్...

సారాంశం

రాజధానిపై  నిర్ణయాధికారం  రాష్ట్రానిదే. 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని తమ రాజధానిగా ప్రకటించింది. 2020 జూలైలో ఒక చట్టం ద్వారా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొంది. ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు మాకు మీడియా ద్వారా తెలిసింది. సమీక్ష తర్వాత మూడు రాజధానులా? ఒక రాజధానా? అన్నది తేల్చుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు విన్నాం. ప్రస్తుతం అమరావతే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది

ఢిల్లీ :  Andrapradesh రాజధాని ఇప్పుడు అమరావతే అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి Nithyanandarai స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2015 లోనే దీన్ని ప్రకటించినప్పటికీ, 2020 లో three capitals  lawని తీసుకు వచ్చి తర్వాత ఉపసంహరించుకుంది అని గుర్తు చేశారు.  ఇప్పుడు మాత్రం అమరావతే capitalగా ఏపీ ప్రభుత్వం తెలియజేసిందని బుధవారం రాజ్యసభలో వివరించారు. బిజెపి సభ్యుడు GVL Narasimha Rao మాట్లాడుతూ.. ‘మూడు రాజధానుల  పేరిట ఏపీ ప్రభుత్వం  అయోమయం సృష్టించింది. కేంద్రం కొన్నిసార్లు ఏపీకి సంబంధించిన వర్తమానాలను హైదరాబాద్ చిరునామాకు పంపుతోంది. ఏపీ రాజధానిపై స్పష్టత ఇవ్వాలి. రాజధాని నిర్ణయాధికారం ఎవరిదో చెప్పాలి’  అని ప్రశ్నించారు.

మంత్రి నిత్యానంద రాయ్ బదులిస్తూ ‘రాజధానిపై  నిర్ణయాధికారం  రాష్ట్రానిదే. 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని తమ రాజధానిగా ప్రకటించింది. 2020 జూలైలో ఒక చట్టం ద్వారా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొంది. ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు మాకు మీడియా ద్వారా తెలిసింది. సమీక్ష తర్వాత మూడు రాజధానులా? ఒక రాజధానా? అన్నది తేల్చుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు విన్నాం. ప్రస్తుతం అమరావతే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది’ అని స్పష్టం చేశారు.

సీఎంలు చర్చించుకుంటే మంచిదే…
‘ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి మిత్రులు. విభజన సమస్యలపై వారిద్దరూ మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం లేదు. కేంద్రం కార్యదర్శి స్థాయి అధికారులను పిలవడానికి బదులు సీఎంలతోనే ఎందుకు చర్చించడం లేదు’ అని బిజెపిఎంపీ CM Ramesh ప్రశ్నించారు.  కేంద్రమంత్రి బదులిస్తూ ‘విభజన అంశాలను ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలని తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో హోంమంత్రి అమిత్ షాసూచించారు. 

ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి చర్చిస్తే మంచిదే. మేము అదే కోరుకుంటున్నాం. హోం శాఖ తరఫున ప్రయత్నించాం. 24 సమావేశాలు నిర్వహించాం’ అని గుర్తు చేశారు. ఏపీకి తెలంగాణ Electricity arrears చెల్లించడం లేదని, శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని వాడుకుంటోందని, దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందని ఎంపీ టిజి వెంకటేష్ ప్రశ్నించారు. ‘విద్యుత్ బకాయిల చెల్లింపు రెండు రాష్ట్రాల మధ్యా ఉంది. దీనిపై కేంద్రం అవగతం చేసుకుని ఏం చేయాలో చూస్తాం. సమన్వయం చేయగలం తప్ప, నిర్ణయం తీసుకోలేం. మా సూచనలు రాష్ట్రాలకు పంపుతాం. శ్రీశైల నీటి విడుదల వివాదాన్ని జలశక్తి శాఖ  పరిశీలిస్తుంది’ అని వివరించారు.

ఇరు రాష్ట్రాల భిన్నవాదనలు..
విభజన సమస్యలపై వైసిపి MP Vijayasaireddy,  బిజెపి ఎంపీలు  సీఎం రమేష్, TG Venkatesh పలు ప్రశ్నలు వేశారు. ‘షెడ్యూల్ 9, 10 లోని సంస్థల విలువను రూ.1,42,601  కోట్లుగా లెక్కించినప్పటికీ,  కేంద్రం వాటిని విభజించలేదు. ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆస్తుల విభజన వేగవంతానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ.. ‘విభజన చట్టం అమలులో కేంద్రం సమన్వయకర్త మాత్రమే. మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేం.  ఆదేశాలివ్వలేం. ఏదైనా ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే జరగాలి.  9వ షెడ్యూల్లోని సంస్థల విభజనపై షీలా బేడీ కమిటీ వేశాం. 90 సంస్థల విభజనకు కమిటీ సిఫార్సు చేయగా, 68 సమస్యలపై తెలంగాణ అంగీకరించింది. ఏపీ ఈ 68లో 38 సంస్థల విభజనకు మాత్రమే సమ్మతించింది. ఏపీ సర్కార్ అన్నింటిని ఒకేసారి పరిష్కరించాలని కోరగా… తెలంగాణ ఒక్కోదాన్ని ప్రత్యేకంగా చూడాలంటోంది.

పదో షెడ్యూల్లో 112 శిక్షణ కేంద్రాలను సెక్షన్  75 ప్రకారం విభజించలేం.  జనాభా ఆధారంగా ఆస్తులు పంచాలని ఏపీ కోరుతుంటే, అది ఉన్న ప్రదేశాన్ని బట్టి విభజించాలని తెలంగాణ అంటోంది. అటార్నీ జనరల్ అభిప్రాయం ప్రకారం అసలు వీటి విభజనకే వీల్లేదు. 9,10 షెడ్యూల్ సంస్థలతో పాటు, మిగతా వాటిపైనా మీరు అంగీకారానికి వస్తే, మేం నిర్ణయం తీసుకోగలం అని హోం శాఖ పలుమార్లు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది’ అని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఏపీకి ఇప్పటివరకు రూ. 65,730 కోట్లు విడుదల చేయగా, తెలంగాణకు రూ. 2,385 కోట్లు ఇచ్చిందని చెప్పారు.  వెనుకబడిన ప్రాంతాలకు ఏటా నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu