ఏకమవుదాం రండి : సోనియా, మమత, చంద్రబాబు సహా 37 మంది విపక్ష నేతలకు స్టాలిన్ లేఖ

Siva Kodati |  
Published : Feb 02, 2022, 09:35 PM IST
ఏకమవుదాం రండి : సోనియా, మమత, చంద్రబాబు సహా 37 మంది విపక్ష నేతలకు స్టాలిన్ లేఖ

సారాంశం

తమిళనాడు ముఖ్యమంత్రి (tamilnadu cm), డీఎంకే (dmk) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (mk stalin) దేశంలోని 37 మంది కీలక రాజకీయ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్‌లో భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. సామాజిక న్యాయాన్ని అలాగే సమానత్వాన్ని విశ్వసించే వాళ్లంతా ఏకతాటిపైకి రావాలని తాను ఆకాంక్షిస్తున్నాని స్టాలిన్‌ లేఖల్లో పేర్కొన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి (tamilnadu cm), డీఎంకే (dmk) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (mk stalin) దేశంలోని 37 మంది కీలక రాజకీయ పార్టీల నేతలకు లేఖలు రాశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో (sonia gandhi) పాటు మరో 36 మంది నేతలకు ఆయన ఈ లేఖలు రాశారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్‌లో భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. సామాజిక న్యాయాన్ని అలాగే సమానత్వాన్ని విశ్వసించే వాళ్లంతా ఏకతాటిపైకి రావాలని తాను ఆకాంక్షిస్తున్నాని స్టాలిన్‌ లేఖల్లో పేర్కొన్నారు.

ప్రత్యేకమైన.. వైవిధ్యభరితమైన బహు సాంస్కృతిక సమాఖ్య నేడు మతోన్మాదంతో పాటు మత ఆధిపత్యం ముప్పులో చిక్కుకుంది అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఆత్మాభిమానంతో పాటు సమానత్వం, సామాజిక న్యాయంపై విశ్వాసం ఉన్న వాళ్లంతా ఒక్కతాటిపైకి వచ్చి ఏకమైతేనే ఈ శక్తుల్ని అడ్డుకోగలమంటూ తమిళనాడు సీఎం అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాల్ని సాధించేందుకుగాను కలిసి కట్టుగా ఉండాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. గతంలో మండల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి చేసిన కృషిని ఆయన గుర్తుచేశారు. అదే స్ఫూర్తితోనే మనమందరం ఏకం కావాలంటూ స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమానమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కులు, అవకాశాలకు అర్హులని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమాన అవకాశాలను అందించిననాడే మన రాజ్యాంగ నిర్మాతల దృష్టిలోని సమానత్వ సమాజాన్ని నిర్మించగలమని  స్టాలిన్ పేర్కొన్నారు.

లేఖలు పంపిన వారిలో సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, ఫారూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, మమతా బెనర్జీ, డీ.రాజా, సీతారం ఏచూరి, చంద్రబాబు నాయుడు, అరవింద్ కేజ్రీవాల్, మెహబూబా ముఫ్తీ, కేసీఆర్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్‌లతో పాటు మరికొందరికి ఈ లేఖను పంపారు స్టాలిన్. వీరికే కాకుండా తమిళనాడులోని వివిధ పార్టీల నేతలకు కూడా పంపారు. ఏఐడీఎంకే కోర్డినేటర్ పన్నీర్‌సెల్వం, పీఎంకే అధినేత రాందాస్, వీసీకే నేత థోల్ తిరుమవలన్‌లతో పాటు వైకోకి కూడా స్టాలిన్ లేఖలు పంపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu