
బీహార్ : biharలో సిబ్బంది వైఫల్యం కారణంగా దాదాపు 400 మంది పన్నెండవ తరగతి విద్యార్థులు Car headlightsవెలుతురులో పరీక్ష రాయాల్సి వచ్చింది. మోతిహరిలోని Maharaja Harendra Kishore Singh Collegeలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…
బీహార్ వ్యాప్తంగా నిన్న 12వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి
Hindi Exam. రెండు భాగాలుగా నిర్వహించారు. తొలిభాగం పరీక్ష ఉదయం జరగ్గా.. రెండో పేపర్ షెడ్యూల్లో మధ్యాహ్నం 11 గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. అయితే మహారాజా హరేంద్ర కిషోర్ సింగ్ పరీక్షా కేంద్రంలో ముందస్తుగా విద్యార్థుల సీటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో గందరగోళం తలెత్తింది. దీంతో విద్యార్థులు, వారి తల్లి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ క్రమంలోనే పరీక్ష చాలా ఆలస్యంగా మొదలయ్యింది. విద్యార్థులకు Answer sheets అందేసరికి సాయంత్రం నాలుగున్నర గంటలు దాటింది. అప్పుడే అసలు సమస్య మొదలైంది. ఆ కాలేజీకి ఎలాంటి విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనరేటర్లతో నడిపిస్తున్నారు. అయితే కొన్ని గదుల్లో ఆ సౌకర్యం కూడా లేక, కొంతమంది విద్యార్థులను కారిడార్లలో కూర్చోబెట్టారు. కానీ అప్పటికే Dark పడింది. దీంతో కార్లలో వచ్చిన కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కారు హెడ్ లైట్లు ఆన్ చేయడంతో ఆ వెలుతురులో విద్యార్థులు పరీక్ష పూర్తి చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ఇది వివాదాస్పదంగా మారింది. దీనిపై తూర్పు చంపారన్ జిల్లా కలెక్టర్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కోసం జిల్లా విద్యాధికారి నేతృత్వంలోని కమిటీని నియమించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, బీహార్ లో జనవరి 28న బంద్ కొనసాగింది. రైల్వే బోర్డు పరీక్షలో జరిగిన అవకతవకలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీహార్ లో బంద్ కొనసాగింి. ఈ క్రమంలోనే విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలతో హోరెత్తించారు. బీహార్ రాజధాని పాట్నాలో రోడ్లను బ్లాక్ చేశారు. భారీ ఎత్తున టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్నారు. కాగా, RRB-NTPC పరీక్ష ఫలితాల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
దీనికి ముందు రెండు రోజుల క్రితం గయాలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఏకంగా ఓ రైలుకు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు.. ఎన్టీపీసీతో పాటు లెవల్ 1 పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్‌బీ-ఎన్టీపీసీ పరీక్షల అవకతవకలను నిరసిస్తూ... విద్యార్థి సంఘాలు బీహార్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీనిని రాష్ట్రంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
నిరసనల్లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) పరీక్ష 2021 పరీక్షను రెండు దశల్లో నిర్వహించాలనే రైల్వే నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారికి రెండవ దశలో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, జనవరి 15వ తేదీన రైల్వే బోర్డు ఎన్టీపీసీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 35 వేల పోస్టుల కోసం జరిగిన ఈ పరీక్షలను సుమారు 1.25 కోట్ల మంది విద్యార్థులు రాశారు. అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.