‘రాహుల్ ప్రధాని అయితే తప్పేంటి...?’

First Published Jun 4, 2018, 2:59 PM IST
Highlights

రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు  రాహఉల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆర్జేడీ నేత, లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ ఎవరికి ఏ పదవి దక్కాలో నిర్ణయించేది ప్రజలు. వాళ్లే కావాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ ఎందుకు ప్రధాని కాకూడదు?. ప్రజల ఆగ్రహానికి గురికానన్ని రోజులూ రాజకీయ నాయకులు, పార్టీల మనుగడ ఉంటుంది. ఎప్పుడైతే నాయకుల పాలనపై ప్రజలకు విసుగొస్తుందో వెంటనే వారిని గద్దె దించేస్తారు. దానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలే నిదర్శనం.’ అని ఆయన అన్నారు.

‘  థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఇంతకు ముందు నిలబడలేదేమో.. ఇకముందు అవి విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఎందుకంటే ఇంతకు ముందు మూడో కూటమి ప్రభుత్వాల్లో కాంగ్రెస్‌ లేదు కాబట్టే అవి మనుగడ సాగించలేకపోయాయి. ఎప్పుడైతే కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ ఏర్పడిందో అప్పటినుంచి వరుసగా పదేళ్లు అధికారంలో నిలిచింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదికపై వచ్చి కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తే కచ్చితంగా దేశానికి మంచి రోజులొస్తాయి. అన్ని పార్టీలు తమతమ ఇగోలు పక్కన పెట్టి ఏకతాటిపై నిలబడితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.’ అని తెలిపారు.
 

click me!