గుడ్ న్యూస్ : క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు, 4వ రోజు.. 2లక్షల లోపే..

Published : May 31, 2021, 10:56 AM IST
గుడ్ న్యూస్ : క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు, 4వ రోజు.. 2లక్షల లోపే..

సారాంశం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగు రోజులుగా రోజువారీ కేసులు రెండు లక్షల దిగువనే నమోదయ్యాయి. రికవరీరేటు ఊరటనిస్తోంది. 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగు రోజులుగా రోజువారీ కేసులు రెండు లక్షల దిగువనే నమోదయ్యాయి. రికవరీరేటు ఊరటనిస్తోంది. 

క్రియాశీలరేటు తగ్గుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఆదివారం 16,88,135 మందికి కోవిడ్ నిర్ణారణ పరీక్షలు నిర్వహించగా.. 1,52,734 మందికి పాజిటివ్ గా తేలింది. 

దాదాపు 50 రోజుల తరువాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. అయితే, నిన్న నిర్థారణ పరీక్సల సంఖ్య కూడా తగ్గింది. 24 గంటల వ్యవధిలో 3,128మంది ప్రాణాలు వదిలారు. వరుసగా ఐదోరోజు మృతుల సంఖ్య నాలుగు వేలకు దిగువనే నమోదయ్యింది. ఇప్పటివరకు 2.8కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా 3,29,100మంది మహమ్మారికి బలయ్యారు. 

ఇక క్రియాశీల రేటు 7.58శాతానికి తగ్గగా... రికవరీ రేటు 91.25 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 20,26,092 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజూ 2,38,022 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.56 కోట్లకు పైబడ్డాయి. మరోవైపు 10,18,076మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు ప్రజలకు అందిన డోసుల సంఖ్య 21,31,54,129.
 
PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు