సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం దేశ ప్రయోజనాలకు విరుద్ధం - ప్రధానికి కేజ్రీవాల్ లేఖ

Published : Jul 17, 2022, 04:19 PM IST
సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం దేశ ప్రయోజనాలకు విరుద్ధం - ప్రధానికి కేజ్రీవాల్ లేఖ

సారాంశం

సింగపూర్ లో జరిగే ప్రపంచ నగరాల సదస్సు కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీ మోడల్ ను ఈ సదస్సుల్లో ప్రదర్శిస్తానని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. అనుమతి ఇవ్వకపోవడం జాతీయ ప్రయోజనాలకు విరుద్దం అని తెలిపారు. 

ప్రపంచ నగరాల సదస్సు కోసం సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జూన్ 1న జరిగిన సమావేశంలో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ (Simon Wong) వారి దేశంలో జ‌రిగే స‌ద‌స్సుకు త‌న‌ను ఆహ్వానించార‌ని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి, ‘ఢిల్లీ మోడల్’ ను తెలియజేయానికి అనుమతిని కోరుతూ తాను గతంలో జూన్ 7న ప్రధాని మోదీకి లేఖ రాశానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే దానికి సమాధానం రాలేదని ఆయ‌న చెప్పారు. 

ఎన్సీపీతో బీజేపీ కలవొచ్చా.. వాళ్లదేమో సహజం, మాదేమో అసహజమా : సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు

‘‘ ఈ సదస్సుకు హాజరయ్యేందుకు అనుమతిని ఇవ్వకపోడం తప్పు. ఢిల్లీ పాలనా నమూనాను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇంత భారీ వేదికపై దీనిని ప్రదర్శించకుండా ఒక సీఎంను అడ్డుకోవడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం ’’ అని కేజ్రీవాల్ తాజా లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ మోడల్ గురించి ప్రపంచం తెలుసుకోవాలనుకుంటుందని, ఇది దేశం గర్వించదగ్గ విషయమని తెలిపారు. సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలకు (ఢిల్లీ మోడల్) వివరిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు సంబంధించిన ఫైల్‌కు ఆమోదం తెలుపలేదు. కాగా సింగపూర్ లో ప్రపంచ నగరాల సదస్సు (WCS) ఆగస్టు 2-3 తేదీల్లో జరగనుంది. 

ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరోక్షంగా ఒకరిపై మరొకరు వ్యాఖ్యలు చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మోడీ ఉచిత ప‌థ‌కాల‌పై మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు 'రేవాడి సంస్కృతి'కి పాల్పడుతున్నాయని, ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఉచితాలను ఇస్తున్నాయని అన్నారు. దేశాభివృద్ధికి ఈ ఉచితాలు ప్రమాదకరమని, దీని పట్ల ప్రజలు ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స్పందించారు.  ‘‘రేవడిలు పంచి, ఉచితాలు ఇస్తున్నది ఎవరో చెబుతాను.. ఇలా వేల కోట్ల స్నేహితుల రుణాలను మాఫీ చేయడం, స్నేహితుల కోసం విదేశీ పర్యటనల ద్వారా వేల కోట్ల కాంట్రాక్టులు పొందడం వల్ల ఉచితాలు ఇస్తున్నారు’ అని ఆమ్ ఆద్మీ చీఫ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఉచిత విద్య, వైద్యం, విద్యుత్ వంటి ప‌థ‌కాలు ‘‘ఉచితాలు’’ కాదని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మార్చడానికి పునాది వేయాలని ఆయన నొక్కి చెప్పారు.

Malda Bomb Blast: మాల్దాలో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

కాగా.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంత్రులు, అధికారులు విదేశాలకు వెళ్లాలంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమని పేరు చెప్పకూడదని ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు.“ పబ్లిక్ సర్వెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం తప్పనిసరి. అయితే ఢిల్లీ సీఎం టూర్ విషయంలో లెఫ్టనెంట్ గవర్నర్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ అనుమతి అవసరం. దీని తరువాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి కూడా రాజకీయ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేయలేరు.’’ అని ఆయన అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu