Raj Thackeray : ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

Published : May 06, 2022, 03:20 PM ISTUpdated : May 06, 2022, 03:40 PM IST
Raj Thackeray : ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

సారాంశం

మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ కొత్త వివాదానికి దారి తీసిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ అధినేత రాజ్ ఠాక్రే కు వ్యతిరేకంగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2008 నాటి పాత కేసులో దీనిని జిల్లా కోర్టు జారీ చేసింది.

ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేపై మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. 2008 నాటి కేసుకు సంబంధించి స్థానిక కోర్టు ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో ఆయన ప్రస్తుతం వార్త‌ల్లో ఉన్నారు. ఈయ‌న మొద‌లు పెట్టిన వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 

ఈ కేసు 10 ఏళ్లకు పైగా పాతది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం 5-10 సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో కోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది. 2008 సంవ‌త్స‌రంలో రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరవుతున్న ఉత్తర భారతీయ యువకులపై కళ్యాణ్ (మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో) స్థానిక మహారాష్ట్రీయులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ MNS కార్యకర్తలు కాల్పులు జరిపారు. దీంతో కళ్యాణ్‌లోని కోర్టు అతనిని అరెస్టు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది.

అయితే రాజ్ ఠాక్రే అరెస్టును నిరసిస్తూ షిరాలాలోని MNS కార్యకర్తల బృందం ఆందోళ‌నల‌ను నిర్వ‌హించింది. దీంతో స్థానిక దుకాణదారులు వారి వ్యాపారాల‌ను మూసేయాల్సి వ‌చ్చింది. దీంతో ఛార్జిషీట్ సమయంలో అనుమతి లేకుండా సమ్మెకు పిలుపునిచ్చినందుకు షిరాలా పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 143 (చట్టవిరుద్ధమైన సమావేశానికి శిక్ష), 109, 117 (నేరాన్ని ప్రోత్సహించడం) బాంబే పోలీసు చట్టంలోని సెక్షన్ 135 కింద కేసు కేసు న‌మోదైంది. ఠాక్రేతో సహా 10 మంది MNS కార్యకర్తలపై షిరాలా ఫస్ట్ క్లాస్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. 

ఈ కేసు ఇప్పుడు 10 సంవత్సరాలకు పైగా పాతబడింది. దీంతో ఏప్రిల్ 6వ తేదీన షిరాలా కోర్టు ఠాక్రేకి వ్యతిరేకంగా NBW జారీ చేసింది, హైకోర్టు ఆదేశానుసారం దానిని వెంటనే క్లియర్ చేయాలని, MNS చీఫ్‌ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ముంబై పోలీసు కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా రాజ్ ఠాక్రే పై దేశద్రోహం కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

పూణెకు చెందిన కార్యకర్త హేమంత్ పాటిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఠాక్రేపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులను ఆదేశించాలని అందులో పేర్కొన్నారు. మే 1వ తేదీన ఔరంగాబాద్ ర్యాలీ ద్వారా అశాంతి సృష్టించేందుకు రాజ్ ప్రయత్నించారని పిటిషన్‌లో ఆయ‌న తెలిపారు. ఔరంగాబాద్ ర్యాలీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు వ్యతిరేకంగా ఠాక్రే మాట్లాడారని, ఇది పార్టీ కార్యకర్తల్లో అశాంతికి దారితీస్తుందని హేమంత్ పాటిల్ తన పిటిషన్‌లో తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చ‌ని అన్నారు.

మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్లు తొల‌గించాల‌ని గ‌త నెల రోజుల నుంచి రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు. మే 3వ తేదీ వ‌ర‌కు వాటిని తీసేయాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేక‌పోతే త‌మ పార్టీ నాయ‌కులు మ‌సీదుల ఎదుట హ‌నుమాన్ చాలీసా ప్లే చేస్తార‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !