కరోనా ఇంకా వెళ్లిపోలేదు, ప్రజలు అలక్ష్యంగా ఉండడం ప్రమాదం: మంత్రులతో ప్రధాని మోడీ

By team teluguFirst Published Jul 8, 2021, 10:35 PM IST
Highlights

కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వదిలిపెట్టి వెళ్లలేదని, పూర్తిస్థాయిలో మనం ఇంకా మహమ్మారిపై విజయం సాధించకముందే ప్రజలు ఇలా వ్యవహరించడం సరికాదని,కరోనా పై పోరును ఇది దెబ్బతీసి ప్రమాదం ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేసారు. 

కాబినెట్ విస్తరణ జరిగిన తరువాత నేడు తొలి కాబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో కరోనా ను ప్రజలు లైట్ గా తీసుకోవడం పై అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. 

గత కొన్ని రోజులుగా ప్రజలు గుమికూడి ఉన్న ప్రాంతాల వీడియోలను, మాస్కుల్లేకుండా, భౌతిక దూరాన్ని పాటించకుండా ప్రజలు విశృంఖలంగా తిరగడం భయానక పరిణామాలను సూచిస్తుందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేసారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, వారితోపాటుగా దేశంలోని అత్యధిక మందికి వాక్సిన్లను ఇచ్చేనందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న వేళ... ప్రజలు ఇలా వ్యవహరించడం సరికాదని ప్రధాని అభిప్రాయపడ్డట్టు సమాచారం. 

కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వదిలిపెట్టి వెళ్లలేదని, పూర్తిస్థాయిలో మనం ఇంకా మహమ్మారిపై విజయం సాధించకముందే ప్రజలు ఇలా వ్యవహరించడం సరికాదని,కరోనా పై పోరును ఇది దెబ్బతీసి ప్రమాదం ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేసారు. 

కరోనా కేసులు ఒకింత తగ్గడంతో ప్రజలు బయటకు రావాలని ఆరాటపడుతుండొచ్చు, కానీ వైరస్ ఇంకా అంతమవనందున అది తిరిగబెట్టే ప్రమాదం లేకపోలేదని,ప్రజలు దీన్ని గుర్తెరగాలని అన్నారు. బయట వేరే దేశాల్లో ఇలా వైరస్ వేవ్స్ రూపంలో తిరగబెట్టడాన్ని మనం గమనించొచ్చని ప్రధాని గుర్తుచేశారు. వైరస్ వేర్వేరు మ్యుటంట్లుగా రూపాంతరం చెందుతున్న వేళా ప్రజలు మరింత అప్రమత్తతతో ఉండాలని ప్రధాని అభిప్రాయపడ్డట్టు సమాచారం. 

మంత్రులుగా మనమంతా ప్రజల్లో భయాన్ని కల్గించేలా కాకుండా సారైనా జాగ్రత్తలు తహెసుకునేలా ప్రజలను నడిపించాలని, అప్పుడు మాత్రమే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడగల్గుతామని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతే కాకుండా కేరళ, మహారాష్ట్రలో పెరుగుతున్న రోజువారీ కేసుల గురించి కూడా ప్రధాని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. 

click me!