రాఫెల్ డీల్.. మోదీ ప్రభుత్వానికి ఊరట

By ramya neerukondaFirst Published Dec 14, 2018, 11:06 AM IST
Highlights

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ సర్కారుకి ఊరట లభించింది. రాఫెల్ ఒప్పందానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ సర్కారుకి ఊరట లభించింది. రాఫెల్ ఒప్పందానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది... పారద్శకంగానే భారత ప్రభుత్వం, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగిందని వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందంపై తమకు  ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంటూ సుప్రీంకోర్టు విచారణకు దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. 

కేంద్రానికి 36 బదులు 126 విమానాలు కొనుగోలు చేయమని చెప్పలేమని స్పష్టం చేస్తూ... ఒప్పందంలోని ప్రతి అంశాన్ని కోర్టు పరిశీలించలేదని స్పష్టం చేసింది. వ్యక్తుల అభిప్రాయాల ఆధారంగా తాము విచారణ జరపలేమని పేర్కొంది. ఈ ఒప్పందంలో ఓ పార్టీకి ఆర్థికంగా ప్రయోజనం చేకూరినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టు పేర్కొంది

భారత ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ కంపెనీతో 59 వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది.. 2016లో ప్రధాని నరేంద్రమోడీ.. నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండేలు ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే.. ఈ విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించాయి. కాగా.. ఈ రోజు న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. 

click me!