శబరిమల వివాదం.. ఒంటికి నిప్పు అంటించుకున్న వ్యక్తి

By ramya neerukondaFirst Published Dec 13, 2018, 2:45 PM IST
Highlights

శబరిమల ఆలయంలోనికి మహిళల ప్రవేశానికి అనుమతి ఇస్తూ.. సెప్టెంబర్ 28వ తేదీన న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నాటి నుంచి.. అక్కడ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి

శబరిమల వివాదం ఇంకా సద్దుమణగలేదు. శబరిమల ఆలయంలోనికి మహిళల ప్రవేశానికి అనుమతి ఇస్తూ.. సెప్టెంబర్ 28వ తేదీన న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నాటి నుంచి.. అక్కడ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఆలయంలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.. వారిని ఆందోళన కారులు అడ్డుకుంటూనే ఉన్నారు.

కాగా.. గురువారం ఓ వ్యక్తి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సెక్రటేరియట్ కి సమీపంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో.. ఓ వ్యక్తి ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. 60శాతం గాయాలతో ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ  ఘటనకు పాల్పడిన వ్యక్తిని వేణుగోపాలన్ నాయర్ గా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై బీజేపీ నేత సీకే పద్మనాభన్ మాట్లాడుతూ.. ‘‘ వేణుగోపాలన్.. అయ్యప్ప స్వామి భక్తుడు.  ఈ ఘటనపై అన్ని కోణాల నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వేణుగోపాల్ మద్యం మత్తులో ఈ పనిచేసినట్లు అనుమానంగా ఉంది. అదేవిధంగా అతనికి కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!