ఓలా డ్రైవర్ వేధింపులు: ట్విట్టర్‌లో మహిళ ఆవేదన

By narsimha lodeFirst Published Dec 13, 2018, 3:22 PM IST
Highlights

 సురక్షితంగా గమ్యస్థానానికి  తీసుకెళ్లకుండా మరో మార్గంలో కారును తీసుకెళ్తున్న డ్రైవర్‌పై ఓలా యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కూడ పట్టించుకోలేదని ఓ మహిళా సీఈఓ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.


బెంగుళూరు: సురక్షితంగా గమ్యస్థానానికి  తీసుకెళ్లకుండా మరో మార్గంలో కారును తీసుకెళ్తున్న డ్రైవర్‌పై ఓలా యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కూడ పట్టించుకోలేదని ఓ మహిళా సీఈఓ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

బెంగుళూరులో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటు చేసుకొందని బాధితురాలు  ట్విట్టర్ వేదికగా తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.  ముంబైలోని ఓ గార్మెంట్‌ ఫ్యాక్టరీలో సీఈఓగా పనిచేస్తున్న ఓ మహిళ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నగరంలోని  ఓ ప్రాంతానికి వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకొన్నారు.

అయితే  క్యాబ్‌ను రూట్ మ్యాప్  ప్రకారంగా కాకుండా వేరే రూట్‌లో తీసుకెళ్తున్నాడు.ఈ విషయాన్ని గమనించిన సదరు మహిళ రూట్‌లో చూపినట్టుగా వెళ్లాలని  కోరింది. దీంతో  తన కారు నుండి దిగిపోవాలని డ్రైవర్ ఆమెను బెదిరించాడు.ఈ విషయమై ఓలా కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫిర్యాదు చేసింది.  కస్టమర్ కేర్ సెంటర్ నుండి  డ్రైవర్‌తో మాట్లాడారు. దీంతో  కస్టమర్‌ను నిర్ణీత ప్రదేశానికి  తీసుకెళ్లాలని  ఆమె ఓలా కస్టమర్  కేర్  నుండి  ఆదేశాలు జారీ చేసింది.

అయితే కస్టమర్‌కేర్ సెంటర్ తో  ‌ఫోన్‌ మాట్లాడుతూ కారు డ్రైవ్ చేయకూడదని బాధితురాలు కోరితే  రాత్రిపూట రోడ్డు మధ్యలోనే కారును నిలిపివేశాడు ఆ డ్రైవర్.ఈ విషయమై బాధితురాలు ఓలా యాజమాన్యానికి ఫోన్ చేసినా కూడ స్పందించలేదు. పోలీసులకు ఫోన్ చేసినా కూడ  సమయానికి కనెక్ట్ కాలేదన్నారు. ఈ విషయాలపై  ఆమె ట్విట్టర్‌ వేదికగా తన ఆవేదనను పంచుకొంది. డ్రైవర్ పై ఫిర్యాదు చేసినా కూడ  ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె  ఆరోపించారు.

click me!