ప్రధానిని పొగడాలని నాకెవరూ చెప్పలేదు.. నా మనసులో ఉన్నది మాట్లాడాను - పద్మ అవార్డు గ్రహీత క్వాద్రీ

Published : Apr 07, 2023, 09:49 AM ISTUpdated : Apr 07, 2023, 09:53 AM IST
ప్రధానిని పొగడాలని నాకెవరూ చెప్పలేదు.. నా మనసులో ఉన్నది మాట్లాడాను - పద్మ అవార్డు గ్రహీత క్వాద్రీ

సారాంశం

ప్రధానిని ప్రశంసించాలని తనకు ఎవరూ చెప్పలేదని, తన మనసులో ఉన్న మాట మాత్రమే చెప్పానని పద్మ అవార్డు గ్రహీత, కర్ణాటక బిద్రి కళాకారుడు షా రషీద్ అహ్మద్ క్వాద్రీ అన్నారు. తనకిప్పుడు 68 సంవత్సరాలు ఉన్నాయని, ఎవరో చెప్పినట్టు తానెందుకు మాట్లాడుతానని ప్రశ్నించారు. 

పద్మశ్రీ అవార్డు గ్రహీత, కర్ణాటక బిద్రి కళాకారుడు షా రషీద్ అహ్మద్ క్వాద్రీ ప్రధానిని పొగడటం పట్ల వివాదం నెలకొంది. ఆయన బుధవారం అవార్డు స్వీకరించిన తరువాత మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఓ ముస్లింకు బహుమతి ఇవ్వదని తాను భావించానని, కానీ ప్రధాని మోడీ తన ఆలోచనలు తప్పని నిరూపించారని అన్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు పట్ల వివాదం నెలకొనడంతో తాజాగా క్వాద్రీ స్పందించారు. ప్రధాని మోడీనిక పొగడాలని తనకు ఎవరూ చెప్పలేదని, తన మనసులో ఉన్న మాట మాట్లాడానని చెప్పారు. 

గౌతమ్ అదానీకి చైనా సంస్థతో, పౌరులతో సంబంధాలున్నాయ్ - కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

‘‘నా మనసులో ఏముందో చెప్పాను. కాంగ్రెస్ హయాంలోనే అవార్డు కోసం ప్రయత్నించాను. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇక ఎలాగూ అవార్డు రాదని మనస్తాపానికి గురై నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. కానీ ఆయన (ప్రధాని మోడీ) నా ఆలోచన తప్పని నిరూపించారు. ఇదే నేను మాట్లాడాను. నేనెప్పుడూ ఏ రాజకీయ నాయకుడినీ సంప్రదించలేదు. సొంతంగా పనిచేసి నా ప్రొఫైల్ ను ప్రభుత్వానికి పంపించేవాన్ని. కానీ అప్పుడు నాకు ఎలాంటి సమాధానమూ రాలేదు. కానీ ఇప్పుడు వారు సమాధానం ఇస్తున్నారు. నాకు ఎవరో బోధించారని అంటున్నారు’’ అని షా రషీద్ అహ్మద్ క్వాద్రీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

‘‘ఇప్పుడు నాకు 68 ఏళ్లు. ఎవరైనా ట్యూషన్ చెబితే వినేందుకు నేనేమైనా చిన్న పిల్లాడినా ?’’ అని అన్నారు. జనవరిలో తనకు అవార్డు వచ్చిందని ప్రకటించారని, కాబట్టి ఈ అవార్డు ఎన్నికలతో సంబంధం లేదని చెప్పారు. ఈ ప్రక్రియ గతేడాదే ప్రారంభమై ఉంటుందని ఆయన అన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ కే ఓటు వేశానని ఖాద్రి చెప్పారు. కానీ ఇప్పుడు తాను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో చేరడానికి అనుకూలంగా ఉన్నానని ఆయన ఓ న్యూస్ ఛానెల్ తో అన్నారని ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదించింది. 

పరువు హత్య : పెళ్లి కాకుండానే గర్భవతైందని.. కూతురిని చంపి, నదిలో విసిరేసిన తండ్రి.. !

ఈ అవార్డు కోసం తాను దరఖాస్తు చేసుకోలేదని, జనవరి 25న అకస్మాత్తుగా ఫోన్ వచ్చిందని క్వాద్రీ తెలిపారు. ‘ఆ రోజంతా ఆనందంతో ఏడ్చాను. నాకు నిద్రపట్టలేదు... బిద్రి కళాకారుడైన మా నాన్నకు నేను ఈ కళను కొనసాగించడం ఇష్టం లేదు, ఎందుకంటే కళాకారుడి జీవితం పోరాటంతో నిండి ఉంటుంది’’ అని క్వాద్రీ తెలిపారు. 

వివాదం ఎక్కడ మొదలైందంటే ? 
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రమోద్ తివారీ ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలే ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. అవార్డు స్వీకరించిన వెంటనే షా రషీద్ అహ్మద్ క్వాద్రీ పొడుగుతూ మాట్లాడటం వెనక బీజేపీ ఉందని ఆరోపించారు. ఆ పార్టీ ఎన్నికల్లో ప్రయోజనాలు పొందేందుకు గట్టి ప్రయత్నం చేస్తోందని అన్నారు. కానీ అది జరగదని తెలిపారు. ‘‘ నేను ఆయనను (క్వాద్రీ) అభినందిస్తున్నాను. ఆయన పని చాలా శ్రేష్టమైనది. కానీ ఈ అవార్డు పొందేందుకు చాలా మంది ఆకాంక్షిస్తున్నారని నమ్ముతున్నాను. 9 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం ఉండి ఉంటే ఆయనకు అవార్డు వచ్చి ఉండేదు కాదని కూడా చెబుతాను. ఇలాంటి వ్యాఖ్యలే చాలా మంది చేసినందున ఆయన నుంచి అలాంటి ప్రకటన వెలువడినట్టు అనిపిస్తోంది. కానీ దీనిని బీజేపీ మాత్రమే ప్రచారం చేసింది’’ అని ప్రమోద్ తివారీ అన్నారు. ఆయన వ్యాఖ్యలు వివాదం రేకెత్తించాయి. దీనిపై బీజేపీ  అధికార ప్రతినిధిషెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. తివారీ వ్యాఖ్యలు కర్ణాటకను, పద్మ అవార్డు గ్రహీతలను అవమానించేలా ఉన్నాయని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?