కోవిడ్ -19 కేసుల పెరుగుద‌ల‌పై భయపడాల్సిన అవసరం లేదు - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

By team teluguFirst Published Aug 9, 2022, 4:48 PM IST
Highlights

ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చాలా కేసుల్లో తక్కువగానే లక్షణాలు ఉన్నాయని చెప్పారు. 

తమ ప్రభుత్వం కోవిడ్ -19 కేసుల పెరుగుద‌ల‌ను నిశితంగా గమనిస్తోందని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న మాట వాస్త‌వ‌మే అని, కానీ చాలా కేసుల్లో స్వ‌ల్పంగానే ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని అన్నారు. కాబ‌ట్టి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. కోవిడ్ క‌ట్ట‌డి కోసం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

నితీష్ కుమార్ పాలిటిక్స్.. బిహార్ రాజకీయాల గురించి 10 ఆసక్తికర విషయాలు

‘‘ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మేము దానిపై నిఘా ఉంచాము. అవసరమైన చర్యలు తీసుకుంటాం. అయితే చాలా కేసులు తేలికపాటివి. భయాందోళన అవసరం లేదు ’’ అని ఆయన అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 

కాగా.. ఆగస్టు 7న ఢిల్లీలో 1,372 కొత్త కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు, ఆరు మరణాలు నమోదయ్యాయి, అయితే కేసు పాజిటివిటీ రేటు 17.85 శాతానికి పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి 21 నుంచి సోమ‌వారం న‌మోదైన కేసులు అత్య‌ధికం.  జనవరి 21వ తేదీన పాజిటివిటీ రేటు 18.04 శాతంగా ఉంది. అయితే ఢిల్లీలో ఆదివారం 2,423 COVID-19 కేసులు నమోదయ్యాయి. 14.97 శాతం పాజిటివ్ రేటు న‌మోదు అయ్యింది. క‌రోనా వ‌ల్ల రెండు మరణాలు సంభవించాయి.

అత్యాచారం కేసులో మిర్చి బాబా అరెస్ట్.. హోటల్ గదిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..

శనివారం ఢిల్లీ న‌గ‌రంలో 2,311 COVID-19 కేసులు న‌మోదు అయ్యాయి. 13.84 శాతం పాజిటివిటీ రేటుతో ఒక మ‌ర‌ణం సంభ‌వించింది. గురువారం 11.84 శాతం పాజిటివ్ రేటుతో 2,202 కేసులు న‌మోదు కాగా.. ఇన్‌ఫెక్షన్ కారణంగా నాలుగు మరణాలు నమోదయ్యాయి. బుధవారం 2,073 కోవిడ్ -19 కేసులు 11.64 శాతం పాజిటివ్ రేటు న‌మోదు అయ్యింది. ఐదు మరణాలు సంభ‌వించాయి. ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,048 గా ఉంది. ఇందులో 5,650 మంది రోగులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని ఆరోగ్య శాఖ త‌న బులిటెన్ లో తెలిపింది. ఇదిలా ఉండ‌గా.. ఢిల్లీలో BA.4, BA.5 స‌బ్ - వేరియంట్‌ల కేసులు కూడా న‌మోదు అయ్యాయి. 

ఇదిలా ఉండ‌గా.. భారతదేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7వ తేదీ నాటికి 20 లక్షలు, ఆగస్టు 23వ తేదీ నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5వ తేదీ నాటికి 40 లక్షలు, సెప్టెంబర్ 16వ తేదీ నాటికి 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28వ తేదీ నాటికి 60 లక్షలు, అక్టోబర్ 11వ తేదీ నాటికి 70 లక్షలు, అక్టోబర్ 29వ తేదీ నాటికి 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది.

లాలూ లేకుంటే బిహార్ నడవదు.. పట్టాభిషేకానికి సిద్దం: బిహార్‌లో భారీ రాజకీయ మార్పుపై లాలూ కూతురు సిగ్నల్..

గ‌తేడాది మే 4వ తేదీన కోవిడ్ -19 కేసులు రెండు కోట్లుగా న‌మోదు అయ్యాయి. అలాగే జూన్ 23వ తేదీన మూడు కోట్లు కేసులుగా రికార్డుల‌కు ఎక్కింది. కాగా ఈ ఏడాది జనవరి 25వ తేదీన మొత్తం నాలుగు కోట్ల కేసుల మైలురాయిని భారత్ దాటింది.
 

click me!