రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం లేదు - కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

Published : Mar 31, 2023, 01:48 PM IST
రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం లేదు - కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

సారాంశం

తనకు రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ అన్నారు. మీడియా ఈ విషయంలో అనవసర కథనాలు ప్రచురించవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. ఓ మీడియా కథనాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ సీనియర్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని తెలిపారు. ఈ విషయంలో మీడియా బాధ్యతాయుతంగా రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అంతకు ముందు ఆయన ముంబై-గోవా హైవే నిర్మాణ పనులను ఏరియల్ తనిఖీ చేశారు. ఆయన వెంట మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ కూడా ఉన్నారు. 

కర్ణాటక ఎమ్మెల్యే అనర్హత వేటుపై నెలరోజుల స్టే.. సుప్రీంకోర్టులో అప్పీల్‌కు హైకోర్టు అవకాశం

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ మాట్లాడుతూ.. ముంబై-గోవా జాతీయ రహదారి నంబర్ 66 నిర్మాణ పనులు 2023 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, 2024 జనవరిలో ఈ రహదారి ప్రారంభమవుతుందని తెలిపారు. ముంబై-గోవా హైవేను 10 ప్యాకేజీలుగా విభజించామని తెలిపారు. వీటిలో సింధుదుర్గ్ జిల్లాలో రెండు ప్యాకేజీలు దాదాపు 99 శాతం పూర్తయ్యాయని అన్నారు. రత్నగిరి జిల్లాలో మొత్తం ఐదు ప్యాకేజీలు ఉండగా, వీటిలో రెండు ప్యాకేజీల వరుసగా 92, 98 శాతం పూర్తయ్యాయని తెలిపారు. రాయ్ గఢ్ జిల్లాలోని మూడు ప్యాకేజీల్లో రెండు ప్యాకేజీలు వరుసగా 93, 82 శాతం వరకు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. 

ముంబై-గోవా జాతీయ రహదారి కొంకణ్ లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలను కలిపుతుందని, దీని వల్ల ఇక్కడి పర్యాటక అభివృద్ధికి ఊతం లభిస్తుందని అన్నారు. దీని వల్ల పారిశ్రామికాభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా 15 వేల కోట్ల విలువైన మూడు కొత్త ప్రాజెక్టులను కూడా కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ ప్రకటించారు. వీటిలో ఒకటి రూ.1,200 కోట్ల కలంబోలి జంక్షన్ ప్రాజెక్టు కాగా, మరొకటి కూడా రూ.1,200 కోట్లతోనే చేపట్టే పగోడ్ జంక్షన్ చౌక్ టు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు. మరొకటి రూ.13,000 కోట్లతో చేపట్టే జేఎన్ పీఏ ద్వారా ఢిల్లీని కలిపే రూ.13,000 కోట్ల మోర్బే - కరంజాడే హైవే ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభం అవుతామయని కేంద్ర మంత్రి చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం