గౌహతిలో భారీ అగ్నిప్రమాదం.. 150 ఇళ్లు, పలు వాహనాలు దగ్ధం

Published : Feb 24, 2023, 01:41 PM ISTUpdated : Feb 24, 2023, 01:42 PM IST
గౌహతిలో భారీ అగ్నిప్రమాదం.. 150 ఇళ్లు, పలు వాహనాలు దగ్ధం

సారాంశం

అస్సాంలోెని గౌహతి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 150 ఇళ్లు కాలిపోయాయి. అనేక వాహనాలు దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ ఈ ఘటనకు కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

అస్సాం రాష్ట్రం గౌహతిలోని హతిగావ్ ప్రాంతంలోని అజంతా పథ్ వద్ద గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఈ అగ్నిప్రమాదంలో 150కి పైగా ఇళ్లు దగ్ధం అయ్యాయి. దీంతో అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అనేక వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ మంటల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు.

తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటన.. ఎందుకంటే?

ఓ ఇంటి నుంచి ఈ మంటలు మొదలై అనేక ఇళ్లకు వ్యాపించాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ ఇంకా కచ్చితమైన కారణాలు ఏంటో తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఈ వీడియోలో దట్టమైన పొగలు ఎగసిపడుతుండటం కనిపిస్తోంది. నిమిషాల్లోనే మంటలు చాలా ఇళ్లకు వ్యాపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు హెల్టర్ స్కెల్టర్ పరుగెత్తారు. ఈ మంటల వల్ల వాహనాలు కాలిపోవడంతో పాటు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ మంటలను ఆర్పేందుకు 15కి పైగా అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. కాగా ఈ ఘటనలో 15కు పైగా సిలిండర్లు పేలిపోయాయని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. 

రూ. 30ల కోసం వ్యక్తి పై కత్తితో దాడి, హత్య.. ఇద్దరు సోదరులు అరెస్టు

ఇదే రాష్ట్రంలోని జోర్హాట్‌లో ఈ నెల 17వ తేదీన చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 100 కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. మార్కెట్ ప్రధాన గేటుకు సమీపంలో ఉన్న ఓ బట్టల దుకాణం నుంచి మంటలు చెలరేగాయి. క్రమేపీ విస్తరిస్తూ రాత్రి 1 గంట వరకు అనేక దుకాణాలకు వ్యాపించాయి. దీంతో దాదాపు 100 దుకాణాలకు కాలిపోయాయి. ప్రమాదంలో చోటు చేసుకున్న జోర్హాట్‌ ప్రాంతం ఏటీ రోడ్‌లో చౌక్ బజార్ రోడ్డులో ఉంది. ఇక్కడి ఓ బట్టల దుకాణంలో రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో దుకాణదారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే అనేక దుకానాలు కాలిపోయాయి. తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu