లాలూ అనారోగ్యాన్ని ఉప‌యోగించుకొని నితీష్ కుమార్ ఆర్జేడీని చీలుస్తారు - బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ

By team teluguFirst Published Aug 10, 2022, 3:44 PM IST
Highlights

నితీష్ కుమార్ ఆర్జేడీని కూడా వదిలేస్తారని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ లీడర్ సుశీల్ కుమార్ మోడీ ఆరోపించారు. తమ పార్టీ ఎప్పుడు కూడా మిత్ర పక్షాలను విచ్చిన్నం చేయదని అన్నారు. 

బీహార్ రాజ‌కీయాలు ఒక్క సారిగా మారిపోయాయి. అధికారంలో ఉన్న ఏన్డీఏ కూట‌మి కూలిపోయింది. ఆ కూట‌మి నుంచి జేడీ(యూ) బ‌య‌టకు వ‌చ్చింది. సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. అనంత‌రం ఆర్జేడీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాల‌పై బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ స్పందించారు. లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యాన్ని ఉపయోగించుకుని రాష్ట్రీయ జనతాదళ్‌ను నితీస్ కుమార్ చీలుస్తార‌ని అన్నారు. త‌రువాత ఆ పార్టీని కూడా వ‌దిలేస్తార‌ని ఆరోపించారు.

రాజకీయ అస్థిరతకు మరో అంకం.. బిహార్ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం ఇదే..!

నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) మంగళవారం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుండి వైదొలిగిన త‌రువాత ప్ర‌తిప‌క్ష కూట‌మిగా ఉన్న మహాఘటబంధన్‌తో చేతులు కలిపింది. బీహార్ సీఎంగా నితీష్ ఈరోజు (బుధవారం) ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయగా, ఆర్జేడీ వారసుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ నేప‌థ్యంలో రాజ్యసభ ఎంపీ సుశీల్ మోడీ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘‘ నితీష్ ఆర్జేడీని వదిలేస్తారు. (అతను) లాలూ అనారోగ్యాన్ని ఉపయోగించుకుని దానిని విభజించడానికి ప్రయత్నిస్తారు ’’ అని అన్నారు. “ జేడీ(యూ)ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు అంటున్నారు. దీనికి శివసేనను ఉద‌హార‌ణ‌గా చెబుతున్నారు. శివసేన మా మిత్రపక్షం కాదు. అక్కడ అధికార పార్టీగా ఉంది. మీరు (జేడీ-యూ) మా మిత్రపక్షం. మేము మా మిత్రపక్షాలను ఎన్నడూ విచ్ఛిన్నం చేయలేదు” అని ఆయ‌న నొక్కి చెప్పారు. 

2014లో గెలిచారు కానీ... 2024లో అసాధ్యం : మోడీపై నితీశ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు

‘‘ బీజేపీ ఎవరికీ ద్రోహం చేయలేదు. నితీష్‌ కుమార్‌ని ఐదుసార్లు బీహార్‌ సీఎంగా చేశాం. ఆర్జేడీ ఆయనను రెండుసార్లు సీఎం చేసింది. మన మధ్య 17 ఏళ్ల బంధం ఉంది. కానీ మీరు రెండుసార్లు (మాతో) బంధాన్ని తెంచుకున్నారు” అని ఆయన అన్నారు. 

విప్లవ కవి వరవరరావుకు బెయిల్: సుప్రీంకోర్టు షరతులు ఇవీ

ఎన్డీయేను చూసి ఓట్లు ప‌డ్డాయ‌ని, కానీ నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని, బీహార్ ప్రజలను అవమానించారని సుశీల్ మోదీ ఆరోపించారు. “ 2020లో మనకు నరేంద్ర మోదీ పేరు మీద ఓట్లు వచ్చాయి. మీ (నితీష్ కుమార్) పేరు మీద మాకు ఓట్లు వచ్చి ఉంటే మేము 150-175 దాటి ఉండేవాళ్ళం. మీరు కేవలం 43 గెలుపొందేవారు కాదు. పరిస్థితి బాగాలేద‌ని అనిపించినప్పుడు నరేంద్ర మోడీ ఒకే రోజులో 3-4 ర్యాలీలు చేశారు. 2020 విజ‌యం న‌రేంద్ర మోడీకే మాత్ర‌మే ద‌క్కుతుంది.’’ అని అన్నారు. 

click me!