భార‌త్ ధ‌నిక‌ దేశ‌మే.. కానీ ప్ర‌జ‌లే నిరుపేద‌లు.. పేదరికంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ  సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

By Rajesh KarampooriFirst Published Sep 30, 2022, 5:30 AM IST
Highlights

పేదరికంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ  సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, సంపన్న దేశంగా ఉన్నప్పటికీ.. దేశ ప్ర‌జ‌లు పేదరికం, ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నార‌ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు

భార‌త‌దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేదరికంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ  సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, సంపన్న దేశంగా ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలు పేదరికం, ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం మరియు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారని నితిన్ గడ్కరీ అన్నారు. ఇక్కడ ధనిక, పేదల మధ్య అంతరాలు రోజురోజుకు పెరుగుతున్న‌  ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

నాగ్‌పూర్‌లో గురువారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు అనుబంధంగా ఉన్న మరో సంస్థ భారత్ వికాస్ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, సామాజిక సమానత్వంపై ఉద్ఘాటించారు. భార‌త్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. పేద జనాభా ఉన్న ధనిక దేశం మనదనీ, మన దేశం సంపన్నమైనది, కానీ మన దేశ‌ జనాభా ఆకలి, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, కులతత్వం, పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు.

ఈ అంశాలు సమాజ ప్రగతికి మంచివి కావని అన్నారు. ప్రస్తుతం దేశంలో సామాజిక, ఆర్థిక సమానత్వం అవసరమని అన్నారు. భార‌త దేశంలో పేద, ధనికుల మధ్య అంతరం రోజురోజుకు పెరిగిపోతున్నాయనీ, అంతే కాదు సామాజిక అసమానతలతో పాటు ఆర్థిక అసమానతలు కూడా పెరిగాయని హెచ్చిరించారు.

పేద, ధనిక మధ్య అంతరాన్ని తగ్గించేందుకు విద్య, ఆరోగ్యం సహా ఇతర రంగాల్లో కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. దేశంలోని 124 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దేశంలోని ఈ 124 జిల్లాలు సామాజిక, విద్య, ఆరోగ్య రంగాల్లో వెనుకబడి ఉన్నాయని అన్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో చాలా అభివృద్ధి జరిగింది, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు, అవకాశాల కొరత కారణంగా అధిక జనాభా నగరాలకు వలస వెళుతోంది. గ్రామీణ ప్రాంతాల సాధికారత కోసం భారత్ వికాస్ పరిషత్ కృషి చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

click me!