నీతి అయోగ్ కార్యాలయ ఉద్యోగికి కరోనా: ఆఫీస్ మూసివేత

By narsimha lode  |  First Published Apr 28, 2020, 3:29 PM IST

ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు వైద్యులు ధృవీకరించారు. నీతి ఆయోగ్ అధికారులు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారు.


న్యూఢిల్లీ: ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు వైద్యులు ధృవీకరించారు. నీతి ఆయోగ్ అధికారులు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారు.

ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నాడు ఉదయానికి కరోనా పాజిటివ్ కేసులు 3,108కి చేరుకొన్నాయి. తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకిన విషయాన్ని నీతి అయోగ్ డిప్యూటీ సెక్రటరీ అజిత్ కుమార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా నీతి ఆయోగ్ భవనాన్ని మూసివేశారు. 

Latest Videos

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్ :' 55 ఏళ్లు దాటిన పోలీసులు ఇళ్లలోనే ఉండొచ్చు'

కరోనా సోకిన అధికారితో సన్నిహితంగా ఉన్న వారిని కూడ క్వారంటైన్ కు తరలించనున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,543 కరోనా కేసులు నమోదుకాగా, 62 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,435కి చేరింది. 934 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఆయా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సోమవారంనాడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. 

 

click me!