ఇంధన ధరలు యథాతథం.. నిర్మలమ్మ హామీ..

Published : Feb 01, 2021, 03:53 PM IST
ఇంధన ధరలు యథాతథం.. నిర్మలమ్మ హామీ..

సారాంశం

రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల మీద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. బడ్జెట్ తో వీటి ధరల్లో మార్పు ఉండదని, యధాతథంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. 

రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల మీద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. బడ్జెట్ తో వీటి ధరల్లో మార్పు ఉండదని, యధాతథంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి, వేతన జీవుల్లో నిరాశనే మిగిల్చింది. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యవసాయ సెస్సు విధింపుపై సర్వత్రా జనాలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే పెట్రోల్‌ ధర కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కొట్టింది. ఇప్పుడు సెస్ విధిస్తే పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన ధరలు మరింత మండిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. లీటర్ పెట్రోల్‌పై‌ 2.50 రూపాయలు, డీజిల్‌పై 4 రూపాయలు వ్యవసాయ సెస్సు విధిస్తే.. ధరలు మరింత పెరగనున్నాయి. 

అడ్డూ, అదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. జీవితాన్ని మరింత నరకప్రాయంగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే కూరగాయలు, నిత్యవసరాల ధరలు కొండెక్కాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ సెస్సు విధిస్తే.. ఇంధన ధరలు మరింత పెరిగి ఆ ప్రభావం మిగతా అన్ని అంశాలపై ఉంటుంది. 

అప్పుడు సామాన్యుడి పరిస్థితి దారుణంగా మారిపోతుంది. దీంతో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీనిపై స్పందించారు. సెస్సు విధింపు వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగబోవని స్పష్టం చేశారు. 

వ్యవసాయ సెస్ విధించి.. ఇతర ట్యాక్స్ లు తగ్గిస్తామని తెలిపారు. సెస్ ల భారాన్ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా డీజిల్, పెట్రోల్ ధరలు య

వ్యవసాయ సెస్‌ విధించి.. ఇతర ట్యాక్స్‌లు తగ్గిస్తామని వెల్లడించారు. సెస్‌ల భారాన్ని సుంకం నంచి మినహాయిస్తామని.. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథాతధంగా ఉంటాయని యధాతథంగా ఉంటాయని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?