నిర్భయ కేసు: ఎవరీ దోషుల తరుఫు న్యాయవాది ఏపీ సింగ్?

By telugu teamFirst Published Mar 2, 2020, 7:09 PM IST
Highlights

రేపు ఉదయం నిర్భయ దోషులందరికి  ఉరి అని దేశమంతా అనుకుంటున్నా తరుణంలో ఇలా ఆ ఉరిని కూడా వాయిదా వేయడంతో మరో సారి అసలు ఈ నిర్భయ దోషుల తరుఫున వాదిస్తున్న లాయర్ ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే చర్చ సర్వత్రా మొదలయింది. 

నిర్భయ కేసు నిందితుల ఉరిని మరోసారి కోర్టు వాయిదా వేసింది. నిందితుడు పవన్ కుమార్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉందని... దానిపై పూర్తి క్లారిటీ వచ్చేంత వరకు ఉరి శిక్షను వాయిదా వేయాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. 

రేపు ఉదయం నిర్భయ దోషులందరికి  ఉరి అని దేశమంతా అనుకుంటున్నా తరుణంలో ఇలా ఆ ఉరిని కూడా వాయిదా వేయడంతో మరో సారి అసలు ఈ నిర్భయ దోషుల తరుఫున వాదిస్తున్న లాయర్ ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే చర్చ సర్వత్రా మొదలయింది. 

Also read: నిర్భయ కేసు: దోషులకు రేపు ఉరి లేదు, మూడోసారి వాయిదా

నిర్భయ దోషుల్లో ఇద్దరు... అక్షయ్ సింగ్ పవన్ కుమార్ గుప్తాలకు లాయర్ గా వ్యవహరిస్తున్నారు ఏపీ సింగ్. ఈయన నిర్భయ ఉదంతం జరిగినప్పుడు అమ్మాయిలు అర్థరాత్రి ఇలా రోడ్లపై తిరగడమేంటి నుంచి ఇలా గనుక తన కూతురు పెళ్ళికి ముంది సెక్స్ చేసినా, అర్థరాత్రి బాయ్ ఫ్రెండ్ తో తిరిగినా బ్రతికుండగానే కాల్చి బూడిద చేస్తాను అనే అనేక వివాదాస్పద, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసారు. 

మహిళల పట్ల, ఆడవారి సమస్యల పట్లు తరచు అనుచిత వ్యాఖ్యలు చేసే ఈ ఏపీ సింగ్ చట్టంలోని లొసుగులను ఉపయోగించి వారి శిక్షను వాయిదా వేస్తూ వస్తున్నారు. నిర్భయ దోషుల్లో ఒకరికి మానసిక స్థితి సరిగా లేదని వాదించినప్పుడు నిర్భయ తల్లి ఆయనను ఘాటుగా విమర్శించింది. 

మతి భ్రమించింది నిర్భయ దోషికి కాదని... ఈ లాయర్ కి అని ఆమె ఘాటు విమర్శలు చేసింది. ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా కూడా న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకొని వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డాడు. 

నిర్భయ కేసును వాదించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రాకపోయేసరకు ఈ ఏపీ సింగ్ ఆ కేసును వాదించడానికి ముందుకు వచ్చాడు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో కి చెందిన ఈ లాయర్ అక్కడే లా చదివాడు. ఆయనకు డాక్టరేట్ కూడా ఉంది. 

1997 నుంచి సుప్రీమ్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఈ లాయర్ తొలిసారిగా 2012లో సాకేత్ లోని ఒక కోర్టులో నిర్భయ దోషుల తరుఫున వాదించాడు. ఇలా నిర్భయ దోషుల గతరుఫున వాదించడానికి గల కారణం అడిగినప్పుడు ఆయన ఎమోషనల్ గా కూడా సమాధానం ఇచ్చాడు. 

Also read: దేవుడి వద్దకు అలా వెళ్లొద్దు: నిర్భయ కేసు దోషుల ఉరి వాయిదాపై కోర్టు

నిర్భయ దోషులలో ఒకడైన అక్షయ్ సింగ్ కు అరెస్ట్ చేసే నాటికి మూడు నెలల పసికందు ఉందని అందువల్ల జాలి కలిగి ఆ కేసును టేక్ అప్ చేసినట్టు ఏపీ సింగ్ వివరించాడు. మొత్తానికి మాత్రం న్యాయ శాస్త్రంలోని లొసుగులను ఉపయోగించుకొని ఇలా ట్విస్టుల మీద ట్విస్టులకు కారకుడవుతున్నాడు. 

click me!