నిర్భయ కేసు: దోషులకు రేపు ఉరి లేదు, మూడోసారి వాయిదా

By narsimha lodeFirst Published Mar 2, 2020, 5:38 PM IST
Highlights

నిర్భయ కేసులో దోషులకు ఉరిని వాయిదా వేస్తూ ఢిల్లీ పటియాల కోర్టు సోమవారం నాడు  స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఉరిశిక్షను వాయిదా వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నిర్భయ కేసులో దోషులకు ఉరిని వాయిదా వేస్తూ ఢిల్లీ పటియాల కోర్టు సోమవారం నాడు  స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఉరిశిక్షను వాయిదా వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also read:పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ: అన్ని దారులు క్లోజ్, రేపే ఉరి

 ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని దోషుల తరపున అక్షయ్ కుమార్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అయితే సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా  ఉరిశిక్షకు గురైన దోషులకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్ లో ఉన్న సమయంలో వారిని ఉరితీయకూడదని చెబుతున్నాయి. అయితే ఎవరి పిటిషన్లు పెండింగ్ లో ఉంటే  వారిని ఉరితీయడం నుండి మినహాయించి ఇతరులను ఉరి తీయాలని ప్రభుత్వాలు కోర్టులను కోరాయి. 

Also Read:నిర్భయ దోషులకు షాక్: స్టేకు ఢిల్లీ కోర్టు నిరాకరణ, రేపే ఉరిశిక్షకు ఛాన్స్?

నిర్భయ కేసులోని నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాలని పాటియాల హౌస్ కోర్టు ఇటీవల డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణశిక్షపై స్టే విధించాలని కోరుతూ ఇద్దరు దోషులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే

Also Read:నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీం షాక్, క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత

అక్షయ్ సింగ్, పవన్ గుప్తా స్టే కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. తాను తాజాగా రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నానని, అది పెండింగులో ఉందని అక్షయ్ సింగ్ తన తరఫు న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేశాడు.

ఇంతకు ముందు రాష్ట్రపతి తిరస్కరించిన మెర్సీ పిటిషన్ లో పూర్తి వాస్తవాలు లేవని అక్షయ్ సింగ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పారు.  ఈ పిటిషన్‌పై ఇవాళ పాటియాల కోర్టు తీర్పును వెల్లడించింది. 

తనకు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదీగా మార్చాలని పవన్ పెట్టుకొన్న క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తీరస్కరించింది. దీంతో పవన్ గుప్తా రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ కూడ పెట్టుకొన్నాడు.  ఈ పిటిషన్;రాష్ట్రపతి  వద్ద పెండింగ్ లో ఉందని కోర్టు అభిప్రాయపడింది.

ఉరిశిక్షపై స్టే విధించాలని నలుగురు దోషుల తరపున అక్షయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను  డిల్లీ పటియాల కోర్టు తిరస్కరించింది. అయితే రాష్ట్రపతి వద్ద పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ కోర్టు స్టే విధించింది.

నలుగురు దోషులను మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని కోర్టు  ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఆదేశాలు జారీ చేసింది.  ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ కుమార్ (31)లకు ఉరిశిక్ష విధించాలని డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

గతంలో ఈ ఏడాది జనవరి 22వ తేదీన తొలిసారి దోషులకు ఉరిశిక్షను విధిస్తూ డెత్ వారంట్ జారీ అయింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన మరోసారి డెత్ వారంట్ జారీ  వారంట్ జారీ అయింది. ఈ రెండు రోజల్లో ఉరిశిక్ష అమలు చేయలేదు. 

తాజాగా మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు మూడోసారి ఉరిశిక్ష విధించాలని  డెత్ వారంట్ జారీ చేశారు. మూడో సారి డెత్ వారంట్ పై సోమవారం నాడు ఢిల్లీ కోర్టు స్టే ఇచ్చింది.మళ్లీ కోర్టు ఆదేశాలు వచ్చేవరకు నిర్భయ దోషులకు ఉరి ఉండనట్టే.  
 

click me!