మందుబాబుల్లో ఫుల్లుగా కరోనా అవగాహన: క్యూ లైన్లలోనే క్వారంటైన్!

By narsimha lodeFirst Published Mar 20, 2020, 3:58 PM IST
Highlights

కరోనా కారణంగా ఒకరికి ఒకరు కనీసం కొంత దూరం పాటించాలని వైద్యఆరోగ్య శాఖాధికారులు సూచిస్తున్నారు.మందు బాబులు మద్యం కొనుగోలు కోసం లిక్కర్ షాపుల వద్ద క్యూ లైన్ల మధ్య దూరాన్ని పాటిస్తున్నారు.

తిరువనంతపురం: కరోనా కారణంగా ఒకరికి ఒకరు కనీసం కొంత దూరం పాటించాలని వైద్యఆరోగ్య శాఖాధికారులు సూచిస్తున్నారు.మందు బాబులు మద్యం కొనుగోలు కోసం లిక్కర్ షాపుల వద్ద క్యూ లైన్ల మధ్య దూరాన్ని పాటిస్తున్నారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కరోనా వ్యాపించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే కేరళ రాష్ట్రంలో మందు బాబులు కూడ మద్యం కొనుగోలు  వచ్చి క్యూ లైన్ల మధ్య దూరాన్ని పాటిస్తున్నారు. మనిషికి కనీస దూరం నిలబడి మద్యం బాటిల్స్ కొనుగోలు చేస్తున్నారు.

క్యూ లైన్లలో నిలబడిన మందుబాబులు ముఖానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకొని క్యూ లైన్లలో నిలబడ్డారు. మరికొందరు తమ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొన్నారు. ఒక వ్యక్తి ఏకంగా హెల్మెట్ పెట్టుకొని మరీ క్యూ లైన్లు నిలబడ్డాడు. 

క్యూ లైన్ల మధ్య కూడ గుర్తులు పెట్టారు. ఈ గుర్తులు పెట్టిన చోటునే క్యూ లైన్లలో లిక్కర్ కొనుగోలు కోసం వచ్చిన వాళ్లు నిలబడడం విశేషం. కరోనా నిరోధానికి ఎక్కువగా జనం బయటకు రాకుండా ఉండాలని కోరుతున్నారు. కానీ, మద్యం ప్రియులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా క్యూ లైన్లలో నిలబడి లిక్కర్ కొనుగోలు చేశారు. 


 

click me!