Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ కేసు: ఎప్పుడు ఏం జరిగిందంటే?

నిర్భయ గ్యాంగ్ రేప్ దోషులను శుక్రవారం నాడు తీహార్ జైలులో ఉరి తీశారు.  మూడు దఫాలు డెత్ వారంట్ మారింది. రెండున్నర మాసాల్లో మూడు దఫాలు డెత్ వారంట్ తేదీలు మారాయి

Nirbhaya's killers hanged at Delhi's Tihar Jail: Here's a timeline of the case
Author
New Delhi, First Published Mar 20, 2020, 1:54 PM IST

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్ దోషులను శుక్రవారం నాడు తీహార్ జైలులో ఉరి తీశారు.  మూడు దఫాలు డెత్ వారంట్ మారింది. రెండున్నర మాసాల్లో మూడు దఫాలు డెత్ వారంట్ తేదీలు మారాయి. అయితే ఉరి తీయడానికి కొన్ని గంటల ముందు కూడ నలుగురు దోషులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. చివరి వరకు దోషులు ఉరి శిక్ష తేదీని మార్చుకొనేందుకు ప్రయత్నాలు చేశారు.

గురువారం నాడు సుప్రీంకోర్టు  ముగ్గురు జడ్జిల ధర్మాసనం పిటిషన్ ను తిరస్కరించడంతో ఈ నలుగురు దోషులకు శుక్రవారం నాడు ఉదయం ఉరి తీయడం సాధ్యమైంది.

నిర్భయ కేసు చరిత్ర ఇదీ

2012 డిసెంబర్ 16వ తేదీన పారా మెడికల్ స్టూడెంట్ దారుణంగా ఆరుగురు దుండగులు ప్రైవేట్ బస్సులో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బాధితురాలి స్నేహితుడిపై దాడికి పాల్పడి ఈ దారుణానికి పాల్పడ్డారు. కదిలే బస్సులోనే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని రోడ్డుపై వదిలివెళ్లారు. బాధితురాలిని సప్థర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు.

డిసెంబర్ 29, 2012: బాధితురాలిపై ఉన్న గాయాలు, ఆమె మెడికల్ కండిషన్స్ ఆధారంగా పోలీసులు దుండగులు ఆమెపై హత్య ఆరోపణలను ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

జనవరి 2, 2013: అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కబిర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రారంభించారు. 

ఆగష్టు 31, 2013: ఈ కేసులో మైనర్ ను కూడ కోర్టు దోషిగా తేల్చింది.

సెప్టెంబర్ 10,2013: ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, పవన్ గుప్తా లు గ్యాంగ్ రేప్ తో పాటు బాధితురాలి హత్య, బాధితురాలి స్నేహితుడిపై హత్యాయత్నం చేసిన కేసులో కోర్టు దోషులుగా తేల్చింది.

సెప్టెంబర్ 13,2013: నలుగురు దోషులకు డెత్ పెనాల్టీ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

మార్చి 13, 2014: ఈ నలుగురు దోషులకు విధించిన మరణశిక్షను హైకోర్టు సమర్ధించింది.

మార్చి 15, 2014: ముఖేష్ కుమార్, పవన్ గుప్తాల డెత్ వారంట్ పై స్టే విధించింది.

ఫిబ్రవరి 3, 2017: దోషులకు మరణశిక్ష విధించే విషయాన్ని కొత్తగా వింటామని సుప్రీంకోర్టు ప్రకటించింది.

మే 5, 2017: నలుగురు దోషులకు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా  పేర్కొంది. అంతేకాదు ఈ కేసును సునామీ ఆఫ్ షాక్ గా పేర్కొంది.

నవంబర్ 8, 2017: నిర్భయ కేసులో దోషిగా ఉన్న ముఖేష్ సింగ్ తనపై విధించిన మరణశిక్షను సమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

డిసెంబర్ 15, 2017: పవన్ గుప్తా, వినయ్ శర్మలు కూడ తమపై విధించిన శిక్షలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు.

జూలై 9, 2018: దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఫిబ్రవరి, 2019: బాధితురాలి తల్లిదండ్రులు దోషులకు డెత్ వారంట్ జారీ చేయాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

డిసెంబర్ 10, 2019: అక్షయ్ కుమార్ సుప్రీంకోర్టులో తనపై విధించిన డెత్ వారంట్ పై సమీక్షించాలని కోర్టును కోరారు.

డిసెంబర్ 18,2019:  అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దోషులు మిగిలిన చట్ పరమైన అవకాశాలను వినియోగించుకొనేందుకు నోటటీసులు జారీ చేయాలని కూడ తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ కోర్టు సూచించింది.

డిసెంబర్ 19, 2019: నిర్భయపై గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో తాను మైనర్ ను అంటూ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

జనవరి 6,2020: ఈ కేసులో ఏకైక సాక్షిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పవన్ కుమార్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది.

జనవరి 7, 2020: నలుగురు దోషులను జనవరి 22వ తేదీ ఉదయం ఏడు గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది.

జనవరి 14, 2020: వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే రోజున ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ పెట్టుకొన్నారు.

జనవరి 17, 2020: ముఖేష్ సింగ్ పిటిషన్ ను రామ్ నాథ్ కోవింద్ కొట్టివేశారు. తీహార్ జైలు అధికారులు కొత్త డెత్ వారంట్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది.

జనవరి 25, 2020: తన క్షమాభిక్ష రద్దు చేయడంపై సుప్రీంకోర్టులో ముఖేష్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు.

జనవరి 29, 2020: అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖేష్ సింగ్ తన మెర్సీ పిటిషన్ రద్దు చేయడంపై దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

జనవరి 30, 2020: అక్షయ్ కుమార్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

జనవరి 31, 2020: పవన్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

ఫిబ్రవరి 5, 2020: ట్రయల్ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. నలుగురిని ఒకేసారి ఉరి తీయాలని ఆదేశించింది. 

ఫిబ్రవరి 6, 2020: తీహార్ కోర్టు అధికారులు డెత్ వారంట్ కోసం కోర్టును ఆశ్రయించారు.

ఫిబ్రవరి 7, 2020: ఢిల్లీ కోర్టు తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.

ఫిబ్రవరి 11, 2020: వినయ్ శర్మ తన మెర్సీ పిటిషన్ రద్దు చేయడంపై సుప్రీంకోర్టులలో పిటిషన్ దాఖలు చేశారు. బాధితురాల తల్లిదండ్రులు కొత్త డెత్ వారంట్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఫిబ్రవరి 13, 2020: డిఎన్ఎస్ ఏ నుండి న్యాయ సహాయాన్ని పవన్ తిరస్కరించారు. దీంతో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అంజనా ప్రకాష్ ను పవన్ న్యాయవాదిగా నియమించారు.

ఫిబ్రవరి 14, 2020: వినయ్  మెర్సీ పిటిషన్ రద్దుపై దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఫిబ్రవరి 17, 2020: మార్చి 3వ తేదీన కొత్త డెత్ వారంట్ ను జారీ చేసింది.

ఫిబ్రవరి 28, 2020: సుప్రీంకోర్టులో పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.

 మార్చి 2, 2020: పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది

మార్చి 4, 2020: ఢిల్లీ ప్రభుత్వం నలుగురు దోషులను ఉరి తీసేందుకు కొత్త డెత్ వారంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

మార్చి 5, 2020: నలుగురు దోషులను మార్చి 20వ తేదీ ఉదయం ఐదున్నర గంటలకు ఉరి తీయాలని కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది.

మార్చి 6, 2020: న్యాయ పరమైన పరిష్కారాలను పునరుద్దరించాలని కోరుతూ ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మార్చి 11, 2020: జైలులో తనపై దాడి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పవన్ గుప్తా పిిటిషన్ దాఖలు చేశారు.

మార్చి 12, 2020: పవన్ గుప్తా తండ్రి ఏకైక సాక్షిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.

మార్చి 13, 2020: మెర్సీ పిటిషన్ రద్దు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వినయ్ శర్మ.

మార్చి 16, 2020: ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

మార్చి 17, 2020: నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని తనకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజున పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.  అక్షయ్ కుమార్ సింగ్ రెండోసారి క్షమాభిక్షను పిటిషన్ పెట్టుకొన్నాడు.

మార్చి 18, 2020: మార్చి 17న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ముఖేష్ సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కొట్టేసింది కోర్టు. వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ సింగ్ లు మరణశిక్షపై స్టే విధించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు తీహార్ జైలు అధికారులకు, పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

మార్చి 19, 2020: పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ముఖేష్ కుమార్ తాను నిర్భయ ఘటన జరిగిన సమయంలో ఢిల్లీలో లేనంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది.వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లు ఉరిపై స్టే కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. 

మార్చి 20, 2020: మరణశిక్ష అమలుపై స్టే విధింపుపై ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది.పవన్ గుప్తా దాఖలు చేసిన రెండో మెర్సీ పిటిషన్ ను తోసిపుచ్చింది కోర్టు. దీంతో ఇవాళ ఉదయం ఐదున్నర గంటలకు దోషులను ఉరి తీశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios