నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వినయ్ శర్మ

By narsimha lodeFirst Published Jan 9, 2020, 12:13 PM IST
Highlights

నిర్భయ కేసులో దోషిగా ఉన్న వినయ్ శర్మ గురువారం నాడు సుప్రీంకోర్టు క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. 

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషిగా ఉన్న వినయ్ శర్మ గురువారం నాడు సుప్రీంకోర్టు క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. 

నిర్భయ కేసులో నిందితులకు ఈ నెల 22వ తేదీ ఉదయం  ఏడు గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు వినయ్ శర్మ. 

Also read:రక్తపు మడుగులో చూశా.. నా గుండె రాయి అయిపోయింది... నిర్భయ తల్లి

ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లను ఉరితీసేందుకు తీహార్ జైలులో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజులుగా అధికారులు ఈ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. 

AlsoRead న్యాయ విద్యార్థినిపై అత్యాచారం... కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడంతో...

2012 డిసెంబర్ 16వ తేదీన 23 ఏళ్ల నిర్భయపై వీరంతా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తున్న సమయంలో  బస్సులోనే వీరంతా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. గంటల తరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఆమె స్నేహితుడిపై కూడ దాడి చేశారు.

  Also Read:  న్యాయ విద్యార్థినిపై అత్యాచారం

తీవ్రంగా గాయపడి నిర్భయ  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29వ తేదీన ఆసుపత్రిలో మరణించింది.  ఈ విషయమై ఆ సమయంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. భవిష్యత్తులో  ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో  నిర్భయ చట్టాన్ని కూడ తీసుకువచ్చారు. 

click me!