నిర్భయ కేసు: బస్సులోనే పైశాచిక చర్య, అసలు ఆ రోజు ఏం జరిగింది?

By telugu teamFirst Published Mar 20, 2020, 5:58 AM IST
Highlights

2012 డిసెంబర్ 16వ తేదీన కదులుతున్న బస్సులు ఆరుగురు కీచకులు వైద్య విద్యర్థినిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఆ రోజును తలుచుకుంటే గుండెను మెలిపెట్టే బాధ కలుగుతుంది.

న్యూఢిల్లీ: 2012 డిసెంబర్ 16వ తేదీ  రాత్రి 9.30 గంటలకు వైద్య విద్యార్థిని తన మిత్రుడితో బస్సు ఎక్కింది. కొంత సేపటికి డ్రైవర్ బస్సును దారి మళ్లించాడు. నిందితులు బస్సు తలుపులు కూడా మూసేశారు. దాంతో అనుమానం వచ్చిన వైద్య విద్యార్థిని మిత్రుడు వారిని ప్రశ్నించాడు. వైద్య విద్యార్థిని పట్ల వారు అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించారు. అడ్డుకోబోయిన అతని తలపై ఇనుపరాడ్ కొట్టారు. దాంతో స్పృృహ తప్పి పడిపోయాడు. 

ఆ తర్వాత ఆమెను బస్సు చివరకు తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. బస్సును నడిపిస్తూనే వారు ఆ క్రూర చర్యకు పాల్పడ్డారు. ఆమె అరిచి, నోటితో కొరికి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. దాంతో ఆమెను తీవ్రంగా కొడుతూ వచ్చారు. ఆమెను ఇనుప రాడ్ తో కొట్టి దాన్ని యోనిలోకి కూడా  చొప్పించారు. 

Also Read: నిర్భయ కేసు దోషులకు ఉరి: బోరున విలపించిన వినయ్ శర్మ

ఆమె గర్భసంచీలోకి ఇనుప రాడ్ ను జొప్పించి పైశాచికానందం పొందారు. బస్సును ఒకరి తర్వాత ఒకరు నడుపుతూ తల నుంచి ఉదరం నుంచి నెత్తురోడుతున్న ఆమెపై అత్యాచారం చేసారు. దాదాపు గంటకు పైగా ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత వివస్త్రగా ఉన్న ఆమెను రోడ్డుపైకి తోసేశారు. ఆమె మిత్రుడిని కూడా తోసేశారు.

ఇనుప రాజ్ జొప్పించడం వల్ల ఉదరంలో, పేగుల్లో, మర్మాంగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయని వైద్యులు పరీక్షలు నిర్వహించి నిర్ధారించారు. ఇనుప రాడ్ తుప్పు పట్టి ఎల్ ఆకారంలో ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. 

Also Read: ఉరికి ముందు కూడా డ్రామాలు ఆపని నిర్భయ దోషులు, ఏమి చేశారంటే....

రాత్రి 11 గంటలకు అటుగా వెళ్తున్నవారు కొంత మంది వారిద్దరు రోడ్డుపై పడి ఉన్న సమాచారాన్ని గస్తీ సిబ్బందికి తెలియజేశారు. గస్తీ సిబ్బంది వారిద్దరిని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. వైద్య విద్యార్థిని నిర్భయకు అత్యవసర చికిత్స చేసి ఆమెను వెంటలేటర్ పై పెట్టారు. వైద్యుల పరీక్షలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. 

ఆమెలో ఉండాల్సిన పేగులు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఉన్మాదులు రాడ్ ను ఆమె లోపలికి జొప్పించి, బలంగా బయటకు లాగడం వల్ల పేగులు బయటకు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. 

వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ లోని బాల్లియా జిల్లాకు చెందినవారు. ఆమె ఢిల్లీలోనే పుట్టి పెరిగింది. అసలు పేరుతో కాకుండా ఆమెను అమానత్, నిర్భయ, దామిని అని పిలుస్తూ వచ్చారు. చివరకు నిర్బయ పేరు స్థిరపడిపోయింది.

click me!