ఉరికి ముందు కూడా డ్రామాలు ఆపని నిర్భయ దోషులు, ఏమి చేశారంటే...

By Sree s  |  First Published Mar 20, 2020, 5:39 AM IST

నిర్భయ దోషులను నేటి ఉదయం  ఉరి తీసిన విషయం తెలిసిందే! వారు ఆఖరు ప్రయత్నంగా అర్థరాత్రి దాటాక మరోసారి సుప్రీమ్ కోర్టు తలుపును తట్టారు. మరోసారి పవన్ గుప్తా ఈ ఉదంతం జరిగినప్పుడు మైనర్ అని అతని పదవ తరగతి సర్టిఫికెట్ ఆధారంగా కోరాడు. 


నిర్భయ దోషులను నేటి ఉదయం  ఉరి తీసిన విషయం తెలిసిందే! వారు ఆఖరు ప్రయత్నంగా అర్థరాత్రి దాటాక మరోసారి సుప్రీమ్ కోర్టు తలుపును తట్టారు. మరోసారి పవన్ గుప్తా ఈ ఉదంతం జరిగినప్పుడు మైనర్ అని అతని పదవ తరగతి సర్టిఫికెట్ ఆధారంగా కోరాడు. 

కోర్టు దాన్ని కూడా మరోసారి తోసిపుచ్చడంతో పాటుగా... పదే పదే ఆ ఒక్క సర్టిఫికెట్ ఆధారంగా మాట్లాడడం తగదని లాయర్ కి సూచించింది. వెంటనే లాయర్ పవన్ గుప్తా గతంలో జైలు అధికారుల తనను జైలులో ఉండగా కొట్టారని దాఖలు చేసిన పిటిషన్ ను ముందుకు తెస్తూ... ఉరిని ఒకటి రెండు రోజులు వాయిదా వేయాలని, ఈ లోగా అతడి స్టేట్మెంటును రికార్డు చేయాలనీ కోర్టును కోరారు. 

Latest Videos

undefined

కోర్టు దాన్ని కూడా తోసి పుచ్చడంతో.... ఆఖరు అస్త్రంగా పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ నేరంలో నేరస్థులకు ఎలా మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చారో ఇక్కడ కూడా అలానే చేయాలని కోరారు. అయినా కోర్టు తిరస్కరించింది. 

ఇక ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో నిర్భయ దోషులు రాత్రంతా మేల్కొనే ఉన్నారు. నేటి ఉదయం వారెవ్వరూ కూడా అల్పాహారాన్ని సేవించలేదు. డాక్టర్లు వచ్చి వారిని పరీక్షించిన తరువాత వారిని ఉరి కంభం వద్దకు తీసుకువచ్చారు. 

తీహార్ జైలు బయట పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... జైలులోని మిగిలిన ఖైదీలంతా తెల్లవారుఝామున్నే వారిని లేపే సమయం కంటే ముందే లేచి ఆసక్తిగా ఉరి కోసం ఎదురు చూసారు. 

నిన్న రాత్రి నుండి నిర్భయ దోషులు వింతగా ప్రవర్తించటం మొదలు పెట్టారు. ముఖేష్ సింగ్ అయితే జైలు అధికారులను దూషించాడు కూడా!ఇక ఈ ఉరిని 5గురు మాత్రమే ప్రత్యక్షంగా చూసారు. జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ లతో సహా మరో జైలు అధికారి మాత్రమే ఈ ఉరికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. 

click me!