నిర్భయ దోషులకు ఉరి... దేశ చరిత్రలో తొలిసారిగా...

By telugu news teamFirst Published Mar 20, 2020, 10:12 AM IST
Highlights

జైలు నియమాల ప్రకారం ఉరి శిక్ష అమలు తర్వాత నలుగురి మృతదేహాలను దీన్ దయాళల్ ఆస్పత్రిలో సరిగ్గా ఉదయం 8 గంటల సమయంలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. తర్వాత కుటుంబ సభ్యుల్ని పిలిపించి.. డెడ్‌బాడీలను గుర్తిస్తారు.. తర్వాత వారికి అప్పగిస్తారు. 
 

నిర్భయ దోషులకు శుక్రవారం తెల్లవారుజామున తీహార్ జైల్లో ఉరి తీశారు. నేరం చేసిన ఎనిమిది సంవత్సరాల తర్వాత దోషులకు శిక్ష పడింది. అయితే.. ఇలా ఒకేసారి నలుగురు దోషులను ఉరితీయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మీరట్ నంచి వచ్చిన తలారీ పవన్ జలాద్ వారిని ఉరితీశాడు.

ఉరి తర్వాత నలుగురు చనిపోయినట్లు డాక్టర్లు కూడా నిర్ధారించారు.. తర్వాత నలుగురి మృతదేహాలను జైలు నిబంధనల ప్రకారం ఆస్పత్రికి తరలించారు. అయితే... ఉరి తర్వాత వారి డెడ్ బాడీలను ఏం చేయనున్నారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Also Read నిర్భయ తల్లిని శిక్షించాలి.. దోషుల తరపు న్యాయవాది షాకింగ్ కామెంట్స్...

కాగా జైలు నియమాల ప్రకారం ఉరి శిక్ష అమలు తర్వాత నలుగురి మృతదేహాలను దీన్ దయాళల్ ఆస్పత్రిలో సరిగ్గా ఉదయం 8 గంటల సమయంలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. తర్వాత కుటుంబ సభ్యుల్ని పిలిపించి.. డెడ్‌బాడీలను గుర్తిస్తారు.. తర్వాత వారికి అప్పగిస్తారు. 

ఒకవేళ కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లడానికి నిరాకరిస్తే.. జైలు అధికారులే అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలాగే జైల్లో ఉన్నంతకాలం నలుగురు దోషులు పనులు చేసి సంపాదించిన డబ్బును వారి కుటుంబాలకు అందజేయనున్నారు. కాగా.. దోషులు నలుగురు ఉరికి ముందు విశ్రాంతి లేకుండా గడిపారని జైలు అధికారులు చెప్పారు. కనీసం నిద్రకూడా పోకుండా ఉన్నారని.. వారి ముఖంలో భయం స్పష్టంగా కనపడిందని చెబుతున్నారు.

కాగా, 2012 డిసెంబర్‌ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. 

రామ్‌సింగ్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత నేడు మిగిలిన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది.
 

click me!