నిర్భయ కేసులో 7 ఏళ్ల నిర్విరామ పోరాటం: ఎవరీ సీమ కుష్వాహా ?

By Sree sFirst Published Mar 20, 2020, 9:14 AM IST
Highlights

నిర్భయ కేసులో న్యాయం కోసం పోరాడిన ఇద్దరు మహిళల్లో ఒకరు నిర్భయ తల్లి ఆశాదేవి కాగా మరో మహిళా నిర్భయ తరుఫు లాయర్ సీమ కుష్వాహా. ట్రైనీ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ కేసును చూసి, అమానవీయ ఘటనను చూసి తట్టుకోలేక న్యాయం గెలవాల్సిందే అన్న కృతనిశ్చయంతో ఈ కేసును ఉచితంగా వాదించడానికి ముందుకు వచ్చింది సీమ. 

నిర్భయ కేసులో దోషులకు 7 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయపోరాటం తరువాత నేటి ఉదయం 5.30 కు ఎట్టకేలకు శిక్ష పడింది. ఈ కేసులో తుదికంటా ఒక మహిళకు న్యాయం జరగడం కోసం ఇద్దరు మహిళలు తమ శక్తినంతా ఒడ్డి పోరాడారు. న్యాయాన్ని గెలిపించారు. 

పోరాడింది నిర్భయ కోసమైనా ఆ పోరాటం ఆ ఒక్క ఆడకూతురి కోసమో కాకుండా, దేశంలో మరెక్కడా ఏ ఆడకూతురు కూడా ఇలా ఇబ్బంది పడకూడదు అన్న కృత నిశ్చయంతో వారిరువురు పోరాడారు. 

నిర్భయ కేసులో న్యాయం కోసం పోరాడిన ఇద్దరు మహిళల్లో ఒకరు నిర్భయ తల్లి ఆశాదేవి కాగా మరో మహిళా నిర్భయ తరుఫు లాయర్ సీమ కుష్వాహా. ట్రైనీ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ కేసును చూసి, అమానవీయ ఘటనను చూసి తట్టుకోలేక న్యాయం గెలవాల్సిందే అన్న కృతనిశ్చయంతో ఈ కేసును ఉచితంగా వాదించడానికి ముందుకు వచ్చింది సీమ. 

ఆ లాయర్ వీరోచిత గాథను మనము కూడా ఒకసారి తెలుసుకుందాం. సీమ ఢిల్లీ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. నిర్భయ ఘటన జరిగినప్పుడు ఆమె ట్రైనీ గా కోర్టులో ప్రాక్టీస్ చేస్తుంది.

నిర్భయ తల్లిదండ్రుల పేదరికాన్ని గమనించిన ఈమె వెంటనే ఆ కేసును ఉచితంగా వాదించడానికి ముందుకు వచ్చింది. కింద కోర్టు నుంచి మొదలుకొని సుప్రీమ్ కోర్టు వరకు ఈ కేసును ఎక్కడా విడిచిపెట్టకుండా, అవసరం వచ్చినప్పుడు సీనియర్ల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్లి న్యాయాన్ని గెలిపించింది. 

రేప్ కు గురైన మహిళలకు న్యాయ సహాయం చేసే జ్యోతి ట్రస్టులో సీమ చేరారు. అక్కడ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుండగా సీమ ఈ కేసును టేక్ అప్ చేసారు. సీమ ఈ కేసును టేక్ అప్ చేస్తున్న తరుణంలో ఐఏఎస్   పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూండేది. 

నలుగురి ఉరి పూర్తయిందన్నా సమాచారం తెలుసుకోగానే... నిర్భయ తల్లి ఆశాదేవి తొలుత థాంక్స్ చెప్పింది సీమాకే! మొత్తానికి ఏడు సంవత్సరాల న్యాయ పోరాటం, దేశ చరిత్రలోనే అత్యంత హేయమైన ఘటనకు ఎట్టకేలకు శిక్ష పడింది.

తన కూతురి ఆత్మకు శాంతి చేకూరింది అని తల్లి ఆశాదేవి సంతోషంగా చెబుతుందంటే... దాని వెనుక సీమ కుష్వాహా కర శ్రమ ఉందనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. 

click me!