నిర్భయ కేసు: నిందితులను ఎలా పట్టుకున్నారు, ఎలా నిర్ధారించారు?

By telugu teamFirst Published Mar 20, 2020, 6:08 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను తీహార్ జైల్లో ఉరి తీశారు. నిర్భయ కేసులో నిందితులను ఎలా గుర్తించారు, ఎలా పట్టుకున్నారో చదవండి.

న్యూఢిల్లీ: నిర్భయ కేసు నిందితులను పోలీసులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. నేరం చేసిన తర్వాత నిందితులు వివిధ ప్రాంతాలకు పారిపోయి తల దాచుకున్నారు. బస్సు డ్రైవర్ రామ్ సింగ్ ను, అతని తమ్ముడు ముకేష్ సింగ్ ను రాజస్థాన్ లో అదుపులోకి తీసుకున్నారు. 

జిమ్ ఇన్ స్ట్రక్టర్ అయిన వినయ్ శర్మను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. పండ్ల వ్యాపారి అయిన పవన్ గుప్తాను కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. మైనర్ బాలుడిని ఉత్తరప్రదేశ్ లోని ఆనంద్ విహార్ టెర్మినల్ లో అదుపులోకి తీసుకున్నారు. అక్షయ్ ఠాకూర్ ను బీహార్ లోని ఔరంగాబాదులో పట్టుకున్నారు. బీహార్ కు చెందిన అతను పని కోసం ఢిల్లీ వచ్చి ఉంటున్నాడు. 

Also Read: నిర్భయ దోషులకు ఉరి: వారు రాత్రి నుంచి జైలులో ఏం చేశారంటే....

మైనర్ బాలుడు ఆ రోజు మాత్రమే మిగతావారిని కలిశాడు. రామ్ సింగ్ ను 2012 డిసెంబర్ 18వ తేదీన మహానగర న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. ముకేష్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత జైలు సహచరులు అతన్ని కొట్టడం ప్రారంభించారు. దాంతో అతన్ని ప్రత్యేక గదిలో ఉంచారు. 

పవన్ గుప్తా తన నేరాన్ని అంగీకరించాడు. తనను ఉరి తీయాల్సిందిగా కోరారు. డిసెంబర్ 19వ తేదీన నిర్భయ మిత్రుడు నిందితులను గుర్తించాడు. 2012 డిసెంబర్ 21వ తేదీన సఫ్ధర్ జంగ్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. 

Also Read: నిర్భయ కేసు: బస్సులోనే పైశాచిక చర్య, అసలు ఆ రోజు ఏం జరిగింది?

2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు వ్యక్తులు వైద్యవిద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 రోజుల తర్వాత 2012 డిసెంబర్ 29వ తేదీన ఆమె మరణించింది.

click me!