నిర్భయ కేసు: రేపు దోషులకు ఉరిశిక్ష లేదు, కోర్టు స్టే

By narsimha lodeFirst Published Jan 31, 2020, 5:42 PM IST
Highlights

నిర్భయ దోషుల ఉరిశిక్షపై శుక్రవారంనాడు పాటియాల కోర్టు స్టే విధించింది. దీంతో ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించాల్సిన ఉరిని వాయిదా పడింది.
 


న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్షపై శుక్రవారంనాడు పాటియాల కోర్టు స్టే విధించింది. దీంతో ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించాల్సిన ఉరిని వాయిదా పడింది.దీంతో నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు మూడోసారి వాయిదాపడింది. తదుపరి వచ్చేవరకు  ఉరిశిక్షను అమలు చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also read:నిర్భయ కేసు: పవన్ గుప్తా పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

ఈ పిటిషన్‌పై విచారణ నిర్వహించిన ఢిల్లీ పాటియాల కోర్టు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంపై  స్టే విధించింది.  తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉరిశిక్ష అమలు చేయకూడదని ఢిల్లీ పాటియాల కోర్టు శుక్రవారం నాడు సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. 

lso read:నిర్భయ కేసు: తీహార్‌ జైలులో డమ్మీలతో ట్రయల్స్ నిర్వహించిన తలారి పవన్

ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్ష అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లను తీహార్ జైలు అధికారులు చేశారు.అయితే ఢిల్లీ పాటియాల కోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 1వ తేదీన  నిర్భయ దోషులకు శిక్షను అమలు చేయకూడదు.

నిర్భయ దోషులు ఉరిశిక్షను అమలు చేయకుండా న్యాయ పరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకొంటున్నారు.   ఈ ప్రక్రియలో భాగంగానే వినయ్ శర్మ ఢిల్లీ పాటియాలా కోర్టులో శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధింపు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో  ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు.

అయితే నలుగురిని ఒకేసారి ఉరితీయాల్సిన అవసరం లేదని కూడ ఢిల్లీ పాటియాల కోర్టుకు కేంద్ర ప్రభుత్వంత తేల్చి చెప్పింది. మరో వైపు తీహార్ జైలులో  తలారి పవన్ జల్లాద్ డమ్మీలతో ఉరి ట్రయల్స్ నిర్వహించారు.

శుక్రవారం నాడు నిర్భయ కేసులో మరో దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన  పిటిషన్‌ను  సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్భయఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌అని అంటూ పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌‌ను  సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేసే విషయంలో జాప్యం జరుగుతున్న తీరుపై  నిర్భయ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని చంపిన దోషులు స్వేచ్ఛగా  తిరగడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 
 

click me!