నిర్భయ కేసు: పవన్ గుప్తా పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

By narsimha lode  |  First Published Jan 31, 2020, 4:43 PM IST

నిర్భయ కేసులో పవన్ గుప్తా పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. 


నిర్భయ కేసులో దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది.నిర్భయ కేసులో దోషి పవన్ గుప్తా శుక్రవారం నాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై ఇవాళ కోర్టు విచారణ చేసింది. A

lso read:నిర్భయ కేసు: తీహార్‌ జైలులో డమ్మీలతో ట్రయల్స్ నిర్వహించిన తలారి పవన్

Latest Videos

undefined

నిర్భయపై గ్యాంగ్‌రేప్ , హత్య జరిగిన సమయంలో తాను మైనర్‌ని  పవన్ గుప్తా కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయమై తాను  దాఖలు చేసిన పిటిషన్‌‌ను  కొట్టివేయడాన్ని  తిరిగి సమీక్షించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు  శుక్రవారం నాడు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.  ఈ కేసులో మరో దోషి  వినయ్ శర్మ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై ఇంకా రాష్ట్రపతి నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.

తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేశాడు.  నిర్భయ కేసులో దోషులకు ఉరి విధించేందుకు ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది..

ఇప్పటికే ఈ నలుగురు దోషులకు డెత్ వారంట్ జారీ చేసింది కోర్టు. ఫిబ్రవరి 1వ తేదీన ఈ నలుగురు  దోషులకు ఉరి శిక్ష విధించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దోషులకు  ఉరి శిక్ష కోసం తలారి  జల్లాద్  డమ్మీలతో  ఉరికి ఏర్పాట్లను చేశారు.
 


 

click me!