నిర్భయ దోషులు చివరి రోజు ఎలా ప్రవర్తించారంటే..: వారి జీవితాలు ఇవీ...

By telugu teamFirst Published Mar 20, 2020, 7:45 AM IST
Highlights

ఉరికంబం ఎక్కడానికి ముందు రోజులు నిర్భయ కేసు దోషులు నలుగురు మౌనం వహించారు. ఏమీ మాట్లాడకుండా తమ తమ గదుల్లో మూలకు ఒదిగి కూర్చున్నారు. ఉరి తప్పదని తేలడంతో నిర్లిప్తంగా మారిపోయారు.

న్యూఢిల్లీ: తాము ఉరికంబం ఎక్కక తప్పదని తెలిసిన తర్వాత నిర్భయ కేసు దోషుల ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. భయం, పశ్చాత్తాపం, నిరాశలను బయటపెట్టని నిర్భయ దోషులు ఉరి పడడానికి ముందు రోజు పూర్తిగా మారిపోయారు. ఏకాంతంగా ఉంటూ, నిశ్శబ్దంలోకి జారిపోయారు. ఎవరితోనూ మాట్లాడకుండా ఓ మూలలో కూర్చుండిపోయారు. 

వారి ముఖాల్లో ఓ రకమైన నిర్లిప్తత కనిపించిందని జైలు అధికారి ఒకరు చెప్పారు. ఉరి తీయడానికి ముందు రోజు నలుుగరిని మూడు నెంబరు జైలులో ఉరితీసే ప్రాంగణానికి పక్కన వేర్వేరు గదుల్లో ఉంచారు. దోషులను కదలికలను సీసీటీవీ కెమెరాల ద్వారా 24 గంటలు సీసీటీవీ కెమెరాల ద్వారా గమనిస్తూ వచ్చారు. 

also Read: నిర్భయ దోషులకు ఉరి... డెడ్ బాడీలను ఏం చేస్తారంటే..

మొదటిసారి ఒకేసారి నలుగురిని ఉరి తీయాల్సి రావడంతో రెండు రోజులు డమ్మీ ఉరితీతను నిర్వహించారు. నలుగురిని ఒకేసారి ఉరి తీయడానికి మీరట్ నుంచి పవన్ జల్లాద్ ను మంగళవారమే రప్పించారు. అతను శుక్రవారం ఉదయం నలుగురిని ఒకేసారి ఉరి తీశాడు. ఉరితీతకు ముందు గురువారం రాత్రి సూపరింటిండెంట్లతో పాటు నలుగురు అధికారులు ఒక్కో దోషి వద్దకు వెళ్లి మీ చివరి కోరిక ఏమిటని అడిగారు. వారు సమాధానం చెప్పలేదు.

నిర్భయ దోషుల జీవితాల వివరాలు పరిశీలిస్తే వారు తిరుగుబోతులు, తాగుబోతులు అని తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్. ఇతను బస్సు డ్రైవర్. 20 ఏళ్ల కిందట రాజస్థాన్ నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వచ్చి రవిదాస్ మురికివాడలో ఉండేవాడు. తాగి వచ్చి అక్కడి ఇరుగుపొరుగువారితో గొడవలు పడుతూ ఉండేవాడు. అతను 2013 మార్చిలో జైలు గదిలో ఉరేసుకుని మరణించాడు. 

Also Read: నిర్భయ కేసు దోషులను ఉరి తీసిన పవన్ జల్లాద్: ఆయనే ఎందుకంటే....

మరో నిందితుడు ముకేష్ సింగ్ రామ్ సింగ్ తమ్ముడు. బస్సు నడిపింది తానే అని, తన అన్న కాదని, తాను అత్యాచారం చేయలేదని బుకాయించడానికి ప్రయత్నించాడు. మిగిలిన దోషులు అది నిజం కాదని చెప్పారు. దాంతో అతని డ్రామాలకు తెర పడింది.

అక్షయ్ ఠాకూర్ తాను నేరం జరిగిన రోజు ఢిల్లీలో లేనని, అంతకు ముందు రోజే అంటే 2012 డిసెంబర్ 15వ తేదీన బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో గల తన స్వగ్రామానికి వెళ్లిపోయానని వాదిస్తూ వచ్ాచడు. నేరం చేసేనాటికి అతనికి 28 ఏళ్లు. అతనికి పెళ్లయింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

నిర్భయను, ఆమె మిత్రుడిని ఇనుప రాడ్ తో మోదింది పవన్ గుప్తా. నిర్భయను ఈడ్చుకుని వచ్చింది కూడా అతనే. ఈ నేరం జరిగినప్పుడు అతనికి 19 ఏళ్లు. తాను చేయరాని నేరం చేశానని అతను అంగీకరించాడు. అయితే, తాను నేరం జరిగినప్పుడు మైనర్ అని వాదిస్తూ తీవ్రమైన శిక్ష నుంచి బయటపడడానికి ప్రయత్నించాడు. 

వినయ్ శర్మ రవిదాస్ మురికివాడలో రామ్ సింగ్ ఇంటికి సమీపంలో ఉండేవాడు. రామ్ సింగ్ కు మిత్రుడు. జిమ్ లో శిక్షకుడుగా పనిచేసేవాడు. 25 ఏళ్ల వయస్సు. ఆ బస్సులో తాను లేనని బుకాయించాడు. ఆ సాయంత్రం పవన్ గుప్తాతో కలిసి ఓ సంగీత కార్యక్రమానికి వెళ్లానని కోర్టులో వాదించాడు. నిర్భయ, ఆమె స్నేహితుడి వద్ద ఉన్న డబ్బును, బంగారా్ని దొంగలించడమే కాకుండా నిర్భయపై అత్యాచారం చేశాడు. 

ఆరో దోషి మైనర్. ఇతను రామ్ సింగ్ వద్ద క్లీనర్ గా పనిచేసేవాడు. నిర్భయపై అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టినవారిలో ముఖ్యుడు. మైనర్ కావడంతో కొద్దిపాటి శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. నిర్భయను బూతులు తిట్టి, చిత్రహింసలు పెట్టినవాళ్లలో ముఖ్యుడు.

click me!