చివరి కోరిక ఏమిటని అడిగితే...నిర్భయ కేసు దోషుల స్పందన ఇదీ...

By telugu teamFirst Published Mar 20, 2020, 8:06 AM IST
Highlights

ఉరి తీయడానికి ముందు మీ చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు నిర్భయ కేసు దోషులను అడిగారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం వారిని ఉరి తీసినట్లు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ చెప్పారు.

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఉరి తీయడానికి ముందు శుక్రవారం తెల్లవారు జామున మీ చివరి కోరిక ఏమిటని అధికారులు అడిగారు. అయితే, వారు ఏ విధమైన కోరికనూ వెల్లడించకుండా మౌనంగా ఉండిపోయారు. వారు ఏ విధమైన కోరిక కూడా కోరలేదని తీహార్ సెంట్రల్ జైలు డైరెక్టర్ జనరల్ తెలిపారు.

నిర్భయ దోషులు ఏ విధమైన కోరికను కూడా వెల్లడించకపోవడంతో శుక్రావరం ఉదయం వారిని నిబంధనల ప్రకారం ఉరి తీశామని జైలు అధికారులు చెప్పారు. వారిని ఉరితీసే సమయంలో తీహార్ జైలు వెలుపల సంబరాలు చోటు చేసుకున్నాయి. వారిని ఉరి తీసిన తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి విక్టరీ సింబల్ చూపించారు.

Also Read: నిర్భయ దోషులకు ఉరి : తీహార్ జైలు బయట పోస్టర్లు ప్రత్యక్షం

నిర్భయ కేసు దోషులను నలుగురిని తీహార్ జైలులో శుక్రవారం ఉదయం సరిగ్గా 5.30 గంటలకు ఉరి తీశారు. పవన్ జలాద్ వారికి ఉరేశాడు. వారిని ఉరి తీయడానికి మూడు సార్లు కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. చివరకు మూడో డెత్ వారంట్ అమలైంది. దాదాపు ఏడున్నరేళ్ల తర్వాత నిర్భయ కేసు దోషులకు శిక్ష పడింది. 

ముకేష్ సింగ్  సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ (31)లకు ఉరి శిక్ష పడింది. ఈ నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితులు ఉండగా, ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: నిర్భయ దోషులు చివరి రోజు ఎలా ప్రవర్తించారంటే..: వారి జీవితాలు ఇవీ...

2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు వ్యక్తులు వైద్యవిద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 రోజుల తర్వాత 2012 డిసెంబర్ 29వ తేదీన ఆమె మరణించింది.

click me!