జైల్లో నిర్భయ దోషులు ఎంత సంపాదించారో తెలుసా..?

By telugu teamFirst Published Jan 15, 2020, 12:37 PM IST
Highlights

నిర్భయ దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌లు తిహార్ జైల్లో ఉన్నపుడు చేసిన పనికి పొందిన వేతనాల డబ్బును జైలు అధికారులు లెక్క వేశారు. ముకేశ్ సింగ్ జైల్లో అందరికంటే అత్యధికంగా రూ.69వేలు సంపాదించారు. మరో దోషి వినయ్ శర్మ రూ.39వేలు, పవన్ గుప్తా రూ.29వేలు సంపాదించారు. 
 
నిర్భయ నిందితులకు ఉరి శిక్ష ఖరారైంది. ఈ నెల 22వ తేదీ నలుగురు దోషులకు ఒకేసారి ఉరి వేయనున్నారు. ఈ నలుగురు దోషులు దాదాపు ఏడు సంవత్సరాలపాటు జైల్లో శిక్ష అనుభవిస్తూ వస్తున్నారు. కాగా... నలుగురు దోషులు జైల్లో పనిచేసి సంపాదించిన డబ్బును వారి కుటుంబసభ్యులకు అందజేయాలని తిహార్ జైలు అధికారులు నిర్ణయించారు.

నిర్భయ దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌లు తిహార్ జైల్లో ఉన్నపుడు చేసిన పనికి పొందిన వేతనాల డబ్బును జైలు అధికారులు లెక్క వేశారు. ముకేశ్ సింగ్ జైల్లో అందరికంటే అత్యధికంగా రూ.69వేలు సంపాదించారు. మరో దోషి వినయ్ శర్మ రూ.39వేలు, పవన్ గుప్తా రూ.29వేలు సంపాదించారు. 

Also Read అలా రాయండి: జర్నలిస్టులకు రజినీకాంత్ సలహా...

మరో దోషి అక్షయ్‌ కుమార్ జైలులో కూలీగా పనిచేసేందుకు నిరాకరించాడు. దీంతో అతనికి జైల్లో ఎలాంటి వేతనం దక్కలేదు. నిర్భయ దోషులు జైల్లో చేసిన కూలీ పనికి పొందిన వేతనాలను వారివారి కుటుంబసభ్యులకు అందజేయాలని తిహార్ జైలు అధికారులు నిర్ణయించారు. ఉరి తీయనున్న నేపథ్యంలో నలుగురు దోషులకు పెట్టే భోజనాన్ని తగ్గించారు.

ఉరి శిక్ష ఖరారు చేసిన నాటి నుంచి ధోషి వినయ్ శర్మ పలుమార్లు అనుచితంగా ప్రవర్తించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఇతను జైలు అధికారులకు సహకరించకుండా, భోజనం చేయకుండా ఆరుసార్లు గొడవ చేశాడు. వినయ్ శర్మ ప్రవర్తన జైల్లో సరిగా లేదని, మిగిలిన ముగ్గురు దోషులు జైల్లో బాగానే ఉన్నారని తిహార్ జైలు అధికారి ఒకరు వెల్లడించారు. 

జైల్లో దుష్ప్రవర్తన కారణంగా వినయ్ శర్మకు జైలు అధికారులు 11 సార్లు శిక్షించారు.పవన్‌గుప్తాకు 8 సార్లు, అక్షయ్‌ కుమార్ కు 3 సార్లు, ముకేశ్‌ సింగ్‌ కు ఒకసారి జైలు అధికారులు  చిన్న చిన్న శిక్షలు వేశారు.

click me!