మరో ఎత్తు: నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్

By telugu teamFirst Published Feb 28, 2020, 3:56 PM IST
Highlights

నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. మార్చి 3వ తేదీన నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉండగా, అతను ఈ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.

న్యూఢిల్లీ: ఉరిశిక్ష అమలుకు తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో నిర్భయ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన పవన్ గుప్తా సుప్రీంకోర్టులో శుక్రవారం క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. మార్చి 3వ తేదీన నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాలా హౌస్ కోర్టు ఇటీవల తాజా డెత్ వారంట్ జారీ చేసిన విషయంతెలిసిందే. 

తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా ఆ పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ కేసు దోషులను విడివిడిగా ఉరి తీయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నవీన్ సిన్హా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

Also Read: నిర్భయ కేసు: మరోసారి దోషి వినయ్ శర్మ అవి మింగి..

నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ దాఖలు చేసింది. 

2012 డిసెంబర్ 16వ తేదీన వైద్యవిద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ కేసులో ఓ మైనర్ శిక్ష అనుభవించి విడుదల కాగా, మరో నిందితుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా నలుగురికి కోర్టు మరణశిక్ష విధించింది.

Also Read: ట్రీట్‌మెంట్ కోసం వినయ్ శర్మ పిటిషన్: షాకిచ్చిన కోర్టు

click me!