నీళ్ళ కుండ ముట్టుకున్నాడని.. తొమ్మిదేళ్ల దళిత బాలుడిని కొట్టి చంపిన టీచర్..

By Bukka SumabalaFirst Published Aug 15, 2022, 7:13 AM IST
Highlights

తన నీళ్లకుండను దళిత బాలుడు తాకాడని ఓ టీచర్ దారుణంగా ప్రవర్తించాడు. విచక్షణా రహితంగా చావబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు, శనివారం మృతి చెందాడు. 

ఉదయపూర్ : స్వాతంత్ర దినోత్సవ అమృతోత్సవాల వేళ కూడా దేశంలో కుల వివక్ష వికృత రూపం ఎక్కడో ఒకచోట బట్టబయలు అవుతూనే ఉంది. rajasthanలోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ప్రైవేట్ స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్ల కుండలు indrakumar మేఘవాలా అనే దళిత విద్యార్థి ముట్టుకున్నాడు. దీంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడిని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.

జూలై 20న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ దెబ్బలతో కొడుకు చెవులు, కళ్లు, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడని తండ్రి దేవరామ్ మేఘవాలా కన్నీటి పర్యంతమయ్యాడు. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. టీజర్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Rajasthan: "ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించండి"

ఇదిలా ఉండగా, జూన్ 9న విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం విజయవాడ లో ఇలాంటి అమానుష ఘటనే చోటు చేసుకుంది. ఓ దళిత యువకుడీని మరో దళిత వ్యక్తి చెట్టుకు కట్టేసి, చెప్పుతో కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది.  వారం రోజుల తరువాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పెందుర్తి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వి.జుత్తాడకు చెందిన తారకేశ్వరరావు మద్యం తాగి,  వైసిపి నాయకుడిని అసభ్య పదజాలంతో దూషించి, అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడు. మర్నాటి ఉదయం తన సెల్ఫోన్ దొంగిలించాడు అన్న ఆరోపణతో తారకేశ్వర రావును సూరిబాబు చెట్టుకు కట్టి, చెప్పుతో కొట్టి,  అసభ్య పదజాలంతో దూషించాడు. 

వైసిపి నాయకుడిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని విరుచుకుపడ్డాడు. మంగళవారం రాత్రి మళ్లీ ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. సూరిబాబు చంపేస్తానని తారకేశ్వర రావు  బెదిరించినట్లు  గ్రామస్తులు చెబుతున్నారు. సూరిబాబు  తారకేశ్వర రావుపై కేసు పెడతానని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో పాత  ఘటన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటన స్థానిక ఎంపీటీసీ సభ్యుడి  ఇంటి సమీపంలోనే జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన సెల్ఫోన్ ను తారకేశ్వరరావు దొంగిలించాడనే సూరిబాబు అతనిని చెట్టుకు కట్టేసి కొట్టినట్లు పెందుర్తి సీఐ అశోక్ కుమార్ తెలిపారు ఈ వీడియో కలకలం రేపిన నేపథ్యంలో గ్రామంలో విచారణ చేశామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు సూరిబాబుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

click me!