Rajasthan: "ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించండి"

By Rajesh KFirst Published Aug 15, 2022, 7:06 AM IST
Highlights

Rajasthan Dalit boy death case: రాజ‌స్థాన్ లో ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బ‌లు తాళ‌లేక ఓ దళిత విద్యార్థి మృతి చెందడంపై  బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్‌ మాయావతి తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు.

Rajasthan Dalit boy death case:  రాజ‌స్థాన్ లో నీళ్ల కుండ తాకినందుకు ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలు తాళలేక ద‌ళిత విద్యార్థి చనిపోయిన ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో దళిత విద్యార్థి మృతి తర్వాత.. ఇంతటి హృదయ విదారక సంఘటనను ఖండించడం చాలా తక్కువని, రాజస్థాన్‌లో ప్రతిరోజూ ఇలాంటి కులతత్వ బాధాకరమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ రాజస్తాన్‭లో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని, అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనులకు రక్ష‌ణ క‌ల్పిచ‌డంలో రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని,  కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు.

అంతకుముందు.. మాయావతి వరుస ట్వీట్లలో రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా, సురానాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదేళ్ల దళిత విద్యార్థిని తాగునీరు కోసం అగ్రవర్ణాల గురించి ఆలోచించే ఉపాధ్యాయుడు కనికరం లేకుండా ఆ విద్యార్థిని కొట్ట‌డంతో ఆ దెబ్బలు తాళలేక‌ చికిత్స పొందుతూ చనిపోయాడు. హృదయ విదారకమైన ఈ ఘటనను ఖండించడమనేది తక్కువ చేయడం అవుతుంది. రాజస్తాన్‭లో కులం పేరుతో ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. దళితులు, గిరిజనులు దాడులకు  గురై తమ ప్రాణాలను కోల్పోతునే ఉంటారు. ఈ విష‌యంలో రాజస్తాన్‭ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని  జలోర్ జిల్లాలో ఉన్న సురానా అనే గ్రామంలో జూలై 20న ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదేళ్ల ఇందర్ కుమార్ మేఘ్‌వాల్ అనే దళిత పిల్లవాడు నీటి కుండను తాకినందుకు ఉపాధ్యాయుడు కొట్టడంతో ఆ చిన్నారి చావగొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ చిన్నారి.. చిక్సిత పొందుతూ శనివారం అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో మరణించాడు.  నిందితుడైన ఉపాధ్యాయుడు ఛైల్ సింగ్ (40)ని అరెస్టు చేసి హత్య నేరంతోపాటు ఎస్పీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భార‌తంలో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం చాలా  దారుణం.

ఈ విషయమై సామాజిక, రాజకీయ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజాస్తాన్‭లోని  గెహ్లోత్ ప్రభుత్వం అప్రమత్తమై బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్ర‌క‌టించింది. నిందితులకు కఠిన‌ శిక్ష వేస్తామని బాధిత కుటుంబానికి భ‌రోసా ఇచ్చింది. 
 

click me!