తొలిసారి: ఒకేసారి తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జిల ప్రమాణం

By narsimha lodeFirst Published Aug 31, 2021, 11:15 AM IST
Highlights

తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జిలు మంగళశారం నాడు ప్రమాణం చేశారు. కొత్త జడ్జిలతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ ప్రమాణం చేయించారు. ఒకే సారి తొమ్మిది మంది జడ్జిలు ప్రమాణం చేయడం ఇదే ప్రథమం. 

న్యూఢిల్లీ:తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జిలుగా  మంగళవారం నాడు ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించారు. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా జడ్జిలున్నారు.తొమ్మిది మంది జడ్జిలు ఒకేసారి ప్రమాణం చేయ డం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే ప్రథమం. సుప్రీంకోర్టు ఆవరణలోని ఆడిటోరియంలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.తొమ్మిది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణం చేయడంతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 33కి చేరింది. 

ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిలుగా జెకె మహేశ్వరి,హిమా కోహ్లి,నాగరత్న, రవికుమార్, సుందరేశ్, బేలా మాధుర్య త్రివేది, అభయ్ శ్రీనివాస్ ఓకా, విక్రమ్ నాథ్, సిటి రవికుమార్, పిఎస్ నరసింహలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపింది.  ఈ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.తొమ్మిది మందిలో తొలిసారిగా ముగ్గురు మహిళా జడ్జిలకు కూడా చోటు దక్కింది. 

click me!