భార్య పెట్టే హింస భరించలేక.. పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టిన ప్రబుద్ధుడు.. చివరికి..

Published : Aug 31, 2021, 11:01 AM IST
భార్య పెట్టే హింస భరించలేక.. పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టిన ప్రబుద్ధుడు.. చివరికి..

సారాంశం

గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఈ విచిత్ర ఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు గానూ సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం చెప్పుకొచ్చాడా వ్యక్తి..

గుజరాత్ : భార్యతో విసిగిపోయిన ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. ఆ కోపాన్ని ఆమె మీద చూపించలేక ఏకంగా పోలీస్ స్టేషన్ కే నిప్పు పెట్టాడు. ఆ భార్యభర్తల మధ్య గొడవలో ఉత్తి పుణ్యానికి పోలీస్ స్టేషన్ అగ్నికి ఆహుతి అయ్యింది. అయితే నిప్పు పెట్టాక అతను అక్కడినుంచి పారిపోకపోవడం విచిత్రం. ‘నన్ను అరెస్ట్ చేయండి’ అంటూ ఠాణా ముందే నిలబడ్డాడు. 

గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఈ విచిత్ర ఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు గానూ సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం చెప్పుకొచ్చాడా వ్యక్తి.. పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే తన భార్య వేధింపులకు గురి చేయడం ప్రారంభించిందని బాధపడ్డాడు. 

ఆమె నుంచి విముక్తి పొందడానికి బజరంగ్ వాడిలోని స్టేషన్ కు నిప్పంటించినట్లు పేర్కొన్నాడు. అయితే పోలీస్ స్టేషన్ కు నిప్పు అంటించిన ఆ వ్యక్తి మానసిక స్థితి బాగోలేదని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu