covid 19 : అక్టోబర్-నవంబర్ లలో థార్డ్ వేవ్ తీవ్రం.. సెకండ్ వేవ్ కంటే తక్కువ ప్రమాదకరమే...

By AN TeluguFirst Published Aug 31, 2021, 10:14 AM IST
Highlights

థార్డ్ వేవ్ గరిష్టానికి చేరుకున్నా రోజుకు లక్ష కేసులు మాత్రమే నమోదు చేస్తాయని తెలిపారు. సెకండ్ వేవ్ తీవ్రదశలో దేశవ్యాప్తంగా రోజులు నాలుగు లక్షల కేసులో నమోదయ్యాయి. అనేకమంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది వైరస్ బారిన పడ్డారు. 

న్యూ ఢిల్లీ : అక్టోబర్-నవంబర్ లలో థార్డ్ వేవ్ పీక్ కు చేరుకుంటుందని  ఐఐటీ-కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ నాటికి ఇప్పుడున్న వాటికంటే ప్రమాదరకమైన వైరస్ కొత్త మ్యూటెంట్ పుడుతుందని దీనివల్లే థార్డ్ వేవ్ తీవ్రం అవుతుందని అంటున్నారు. అయితే సెకండ్ వేవ్ తో పోల్చితే..  థార్డ్ వేవ్ తీవ్రంత తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 

అంటువ్యాధుల తీవ్రత అంచనా వేయడానికి నియమించిన ముగ్గురు సభ్యుల నిపుణుల బృందంలో అగర్వాల్ ఒకరు. ఒకవేళ కొత్త వైరస్ పుట్టకపోతే పరిస్థితిలో మార్పు ఉండదని చెబుతున్నారు.  

థార్డ్ వేవ్ గరిష్టానికి చేరుకున్నా రోజుకు లక్ష కేసులు మాత్రమే నమోదు చేస్తాయని తెలిపారు. సెకండ్ వేవ్ తీవ్రదశలో దేశవ్యాప్తంగా రోజులు నాలుగు లక్షల కేసులో నమోదయ్యాయి. అనేకమంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది వైరస్ బారిన పడ్డారు. 

కొత్త ఉత్పరివర్తనం రాకపోయినా, సెప్టెంబర్ లో సెప్టెంబర్ నాటికి కేసుల సంఖ్యలో 50శాతం పెరుగుదల కనిపిస్తుంది. స్టేటస్ట కో అనేది కొత్త ఉత్పరివర్తనం రాకపోయినా, సెప్టెంబర్ నాటికి 50 శాతం ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉత్పరివర్తన వచ్చినప్పుడు కొత్త వేరియంట్ ఉంటుంది. గమనిస్తే థార్డ్ వేవ్ లో కొంత్ ఏకైక దృష్టాంతం ఎప్సిలాన్ = 1/33 కోసం కొత్త వైవిద్యం. దీనివల్ల కొత్త కేసులు రోజుకు లక్ష వరకు పెరుగుతాయి. అని అగర్వాల్ ట్వీట్ చేశారు. 

గత నెలలో ఇదే మోడల్ అక్టోబర్, నవంబర్ మధ్య థార్డ్ వేవ్ గరిష్టానికి చేరుకుంటుందని SARS-CoV2 మరింత తీవ్రంగా మారి రోజువారీ కేసుల సంఖ్య 1.5 లక్షల నుంచి 2 లక్షలకు చేరుకుంటుందని తెలిపింది. 

ఏదేమైనా థార్డ్ వేవ్ లో ఇన్ ఫెక్షన్లకు కారణమైన డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమై మ్యూటెంట్ ఇప్పటివరకు లేదు. గతవారం లెక్క ప్రకారం కేసుల పరిధి తాజా వాటితో పోల్చితే 1నుంచి 1.5లక్షలకు తగ్గించబడింది. తాజా డేటాతో, రోజువారీ ఇన్ ఫెక్షలు లక్ష వరకు తగ్గుతాయని భావిస్తున్నారు. 

జులై, ఆగస్టుల్లో జరిగిన టీకా డ్రైవ్ లు వల్ల ఈ ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశంలో 63 కోట్లకు పైగా టీకాలు వేశారు. 

click me!