బస్సుని ఢీకొట్టిన మినీ లారీ...9మంది దుర్మరణం

Published : Jul 18, 2019, 12:35 PM IST
బస్సుని ఢీకొట్టిన మినీ లారీ...9మంది దుర్మరణం

సారాంశం

తమిళనాడులో ఘెర రోడ్డు ప్రమాదం మినీలారీ, ఓమ్నీ బస్సు ఢీ.. 9మంది మృతి మృతులు జార్ఖండ్ కి చెందిన కార్మికులుగా గుర్తింపు

బస్సుని, మినీ లారీని ఢీకొట్టిన ఘటనలో 9మంది దుర్మరణం  చెందారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...

జార్ఖండ్ కి చెందిన 14మంది కార్మికులు మినీలారీలో వెళుతుండగా.. విల్లుపురం జిల్లా సమీపంలో ఉదయం 2.45నిమిషాల సమయంలో ప్రమాదం జరిగింది. వేగం వస్తున్న ఓమ్నీ బస్సు.. మినీ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు.. మినీ లారీ డ్రైవర్, ఓమ్నీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఏడుగురు కార్మికులు తీవ్రగాయాలపాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఓమ్నీ బస్ కోయంబత్తూరు నుంచి చెన్నైకి వెళుతున్నట్టుగా తెలిసింది. అన్నానగర్ ఫ్లైఓవర్‌పై ఘటన సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?