క‌ర్నాట‌క మంత్రుల్లో 9 మంది కోటీశ్వరులు, నలుగురిపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్

Published : May 22, 2023, 11:34 AM IST
క‌ర్నాట‌క మంత్రుల్లో 9 మంది కోటీశ్వరులు, నలుగురిపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్

సారాంశం

ADR study: ఇటీవ‌ల కొలువుదీరిన క‌ర్నాట‌క క్యాబినెట్ మంత్రులంతా కూడా కోటీశ్వరులేననీ, సగటు ఆస్తుల విలువ రూ.229.27 కోట్లుగా ఉన్నాయ‌ని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ రూ.16.83 కోట్లతో అత్యల్ప ఆస్తులతో ఈ జాబితాలో చివ‌ర‌లో ఉన్నారు. రూ.1413.8 కోట్ల ఆస్తులతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.  

Election watchdog ADR: కర్ణాటక కేబినెట్ లోని తొమ్మిది మంది మంత్రులు కోటీశ్వరులేనని ఎన్నికల వాచ్ డాగ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక‌ పేర్కొంది. తొమ్మిది మంది మంత్రుల్లో నలుగురికి నేరచరిత్ర ఉందని కూడా తెలిపింది. ఏడీఆర్ నివేదికలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యధిక ఆస్తులను ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ప్రియాంక్ ఖర్గే అత్యల్ప ఆదాయం కలిగి ఉన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. కర్ణాటక ప్ర‌భుత్వంలో కొత్తగా నియమితులైన మంత్రులందరూ తమపై క్రిమినల్ అభియోగాలు మోపిన విష‌యాల‌ను త‌మ నామినేష‌న్ ప‌త్రాల్లో ప్ర‌స్తావించార‌ని  లాభాపేక్ష లేని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్), కర్ణాటక ఎలక్షన్ వాచ్ డాగ్ (కేఈడబ్ల్యూ) నివేదిక తెలిపింది. శనివారం ప్రమాణ స్వీకారం చేసిన పది మంది మంత్రుల్లో తొమ్మిది మందిని ఈ నివేదిక విశ్లేషించింది. నలుగురు మంత్రులు తీవ్రమైన నేరారోపణలతో సతమతమవుతున్నార‌ని పేర్కొంది. 

మంత్రులంతా కూడా కోటీశ్వరులేననీ, సగటు ఆస్తుల విలువ రూ.229.27 కోట్లుగా ఉన్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ రూ.16.83 కోట్లతో అత్యల్ప ఆస్తులతో ఈ జాబితాలో నిలిచారు. రూ.1413.8 కోట్ల ఆస్తులతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
డీకే శివకుమార్ కు అత్యధికంగా రూ.265.06 కోట్ల అప్పులున్నాయి. మొత్తం తొమ్మిది మంది మంత్రులు తమకు అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ జీ.పరమేశ్వర అత్యల్పంగా రూ.9 కోట్ల అప్పులు ఉన్నట్లు ప్రకటించారు.

సీఎం పదవికి పోటీ పడిన పరమేశ్వర్ వ్యవసాయ పరిశోధనలో డాక్టరేట్ పొందిన అత్యంత విద్యావంతుడైన మంత్రిగా కూడా ఈ జాబితాలో ఉన్నారు. మైసూరు ఓపెన్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ చేసినట్లు శివకుమార్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. కొత్త సీఎం సిద్ధరామయ్య మైసూరులోని శారదా విలాస్ లా కాలేజీలో న్యాయ విద్యను అభ్య‌సించిన‌ట్టు తెలిపారు. ఆరుగురు మంత్రులు గ్రాడ్యుయేషన్ స్థాయి, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగి ఉన్నారు. ముగ్గురు మంత్రులు 8వ తరగతి నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత వరకు అర్హతలను ప్రకటించారు.

కొత్త మంత్రుల్లో ఇద్దరు - సీఎం సిద్దరామయ్య, కేహెచ్ మునియప్ప 75 సంవత్సరాలు వ‌య‌స్సు వారీగా ఉన్నారు. వారు ప్రస్తుత మంత్రివర్గంలో అత్యంత వృద్ధ మంత్రులుగా ఉన్నారు. అత్యంత పిన్న వయస్కుడైన కొత్త మంత్రి ప్రియాంక్ ఖర్గే 44 ఏళ్ల వయసులో వారి కంటే 30 ఏళ్లు చిన్నవాడుగా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu