కంగనా వ్యాఖ్యలు... దేశం పరువు పోతుందంటూ ఫైర్ అయిన బీజేపీ నేత...

By AN TeluguFirst Published Nov 17, 2021, 5:04 PM IST
Highlights

గాంధీ గురించి అసంబద్ధమైన విషయాలు మాట్లాడడం ద్వారా Kangana Ranaut ఏమి కోరుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. స్వాతంత్ర్య పోరాటంపై రోజువారీ ప్రశ్నలు ఆమె గుప్పిస్తోంది. ఈ దేశ ప్రజల మనోభావాలను  గాయపరుస్తుంది.  ఆమె కేవలం దేశ ప్రజల మనోభావాలను గాయపరచడమే కాకుండా దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చుతోంది.. అని అబ్బాస్ అన్నారు. 

న్యూ ఢిల్లీ : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలను బీజేపీ ఢిల్లీ ప్రతినిధి నిఘత్ అబ్బాస్ తప్పుపట్టారు. గాంధీజీ బోధనలతో స్ఫూర్తి పొందిన వారిలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారని, గాంధీకి వ్యతిరేకంగా చేసే ప్రకటనల వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోతుందని అన్నారు, ‘మహాత్మాగాంధీకి దేశ ప్రజలే జాతిపిత హోదా ఇచ్చారు. ఆయన ఆలోచనలను బీజేపీ సజీవంగా నిలుపుతోంది. ఆయన ఆలోచనలు మన ప్రధాని నరేంద్ర మోడీకి సైతం స్ఫూర్తిగా నిలిచాయి..’ అని ఆమె అన్నారు ఈ మేరకు ఒక వీడియోను ట్విట్టర్ టైం లైన్ లో Nighat Abbas షేర్ చేశారు.

గాంధీ గురించి అసంబద్ధమైన విషయాలు మాట్లాడడం ద్వారా Kangana Ranaut ఏమి కోరుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. స్వాతంత్ర్య పోరాటంపై రోజువారీ ప్రశ్నలు ఆమె గుప్పిస్తోంది. ఈ దేశ ప్రజల మనోభావాలను  గాయపరుస్తుంది.  ఆమె కేవలం దేశ ప్రజల మనోభావాలను గాయపరచడమే కాకుండా దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చుతోంది.. అని అబ్బాస్ అన్నారు.  gandhiji జాతిపిత అని ఎప్పటికి జాతిపిత గానే ఉంటారని BJP కూడా ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు.

దీనికి ముందు గాంధీజీ *అహింసా సిద్ధాంతాన్ని‘ కంగనారనౌత్ విమర్శిస్తూ ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించడం అనేది ఎలాంటి ఆజాది అవుతుందని ప్రశ్నించారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లకు గాంధీజీ నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదని అన్నారు.  ‘మీ హీరోలను తెలివిగా ఎంచుకోండి’ అంటూ ఇంస్టాగ్రామ్ లో వరుస పోస్టులలో వ్యాఖ్యానించారు.

Netaji: మహాత్మా గాంధీ.. సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు: నేతాజీ కూతురు అనితా బోస్

ఇదిలా ఉండగా, కంగనా వ్యాఖ్యలపై నేతాజీ Subhash Chandrabose కూతురు Anita Bose కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మధ్య సంబంధాలు కఠినంగా ఉండేవని పేర్కొన్నారు. అయితే, తన తండ్రి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్.. మహాత్మా గాంధీని ఆరాధించేవారని వివరించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలు సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటీష్‌ వారికీ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై ఓ మీడియా సంస్థ స్పందన కోరగా ఆమె ఈ రోజు ఇలా సమాధానమిచ్చారు.

భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌లు ఇద్దరూ గొప్ప యోధులేనని అనితా బోస్ అన్నారు. ఒకరు లేకుండా మరొకరు ఈ ఘనత సాధించేవారు కాదని పేర్కొన్నారు. ఇద్దరి పోరాటమూ స్వాతంత్ర్యం పొందడానికి దోహపడ్డాయని తెలిపారు. కానీ, కొందరు కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ వాదిస్తున్న.. అహింసా విధానమే భారత‌ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందనేది వాస్తవం కాదని అభిప్రాయపడ్డారు. 

భారత్‌కు స్వేచ్ఛా వాయువులు అందించడానికి నేతాజీ, ఆయన స్థాపించిన ఇండియన్ నేషన్ ఆర్మీ(ఐఎన్ఏ)ల పాత్రలూ ఉన్నాయని అన్నారు. అయితే, అదే సమయంలో కేవలం నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఐఎన్ఏ మాత్రమే భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని వాదించడం అర్థరహితమేనని అనితా బోస్ అన్నారు. మహాత్మా గాంధీ చాలా మందిలో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రేరణ తెచ్చారని, అందులో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ కూడా ఒకరు అని వివరించారు. 

click me!