చైనా యాప్స్‌‌ వెనుక ఉగ్రకోణం..?, రంగంలోకి ఎన్ఐఏ

By Siva KodatiFirst Published Sep 20, 2020, 4:30 PM IST
Highlights

చైనా యాప్స్‌పై రంగంలోకి దిగింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో చైనా యాప్స్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే చైనా యాప్స్‌పై ఈడీతో పాటు ఐటీ విచారణ జరుగుతోంది

చైనా యాప్స్‌పై రంగంలోకి దిగింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో చైనా యాప్స్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే చైనా యాప్స్‌పై ఈడీతో పాటు ఐటీ విచారణ జరుగుతోంది.

కార్యకలాపాల్లో ఉగ్రవాద కుట్రకోణం ఉందన్న అనుమానంతో దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. దీనిలో భాగంగా సీసీఎస్ దగ్గరున్న వివరాలను ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నారు. రూ. 2 వేల కోట్లకు పైగా చైనాకు నగదు మళ్లించాయి పలు కంపెనీలు.

యాప్స్ పేరిట భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లుగా ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో అనధికారికంగా ఈ కంపెనీలు రూ. వేల కోట్లను చైనాకు తరలించినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే చైనా యాప్స్‌పై ఈడీతో పాటు ఐటీ విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌తో హవాలా లాంటి కోణాలు వున్న నేపథ్యంలో ఈడీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది.

బీజింగ్ టీ కంపెనీ పేరుతో కొన్ని వందల యాప్స్ భారతీయ మార్కెట్‌లోకి చొప్పించి, ఆన్‌లైన్ గేమింగ్‌ను నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ గేమింగ్‌ల వెనుక ఉగ్ర కుట్ర వుందా లేదా అన్న దానిపై ఎన్ఐఏ దర్యాప్తు జరపనుంది. 
 

click me!