కరోనా హాట్‌స్పాట్: తెరుచుకోనున్న కోయంబేడ్ మార్కెట్

By narsimha lodeFirst Published Sep 20, 2020, 3:46 PM IST
Highlights

నాలుగు మాసాల తర్వాత కోయంబేడు మార్కెట్ ను పాక్షికంగా తెరవననున్నారు. 300 దుకాణాలను విడతలవారీగా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.


చెన్నై: నాలుగు మాసాల తర్వాత కోయంబేడు మార్కెట్ ను పాక్షికంగా తెరవననున్నారు. 300 దుకాణాలను విడతలవారీగా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ద్విచక్రవాహనాలను మార్కెట్లోకి అనుమతించడం లేదు.నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినంగా శిక్షలు విధించనున్నట్టుగా అధికారులు ప్రకటించారు. అంతేకాదు మార్కెట్ పనివేళలను కూడ తగ్గించారు. 

ఈ నెల 28వ  తేదీ నుండి ఈ మార్కెట్ లో దుకాణాలను విడతలవారీగా ఓపెన్ చేయనున్నారు. కరోనా కంటే ముందు ప్రతి రోజూ ఈ మార్కెట్ కు కనీసం లక్ష మంది ప్రజలు వచ్చేవారు. 

ఈ మార్కెట్ ద్వారా కనీసం 3 వేల మందికి కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు అంచనా వేశారు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది మార్చి మాసంలో కోయంబేడు మార్కెట్ ను ప్రభుత్వం మూసివేసింది. 

అయితే ఈ మార్కెట్ పై ఆధారపడి జీవనం సాగించే వ్యాపారులకు ఇబ్బందిగా ఉండడంతో మార్కెట్ ను తెరవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో విడతలవారీగా మార్కెట్ ను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
 

click me!