ఒక్కో బ్లాస్ట్‌కి రూ. కోటి నజరానా: దర్బాంగా బ్లాస్ట్‌లో సంచలన విషయాలు

By narsimha lodeFirst Published Jul 18, 2021, 11:26 AM IST
Highlights


 దర్బాంగా పేలుడులో ఎన్ఐఏ కీలక  విషయాలను కనుగొంది.  ఈ బ్లాస్ట్ లో  మరొకరి ప్రమేయం ఉందని కూడ దర్యాప్తు అధికారులు గుర్తించారు. సలీమ్ అనే వ్యక్తికి ఇంటర్నెట్ పై అవగాహన లేకపోవడంతో ఖలీం అనే వ్యక్తి సహాయం చేసినట్టుగా గుర్తించారు. ఒక్కో బ్లాస్ట్ కు మాలిక్ సోదరులకు కోటి రూపాయాలు నజరానా  ఇవ్వాలని నిర్ణయించారు.
 


హైదరాబాద్: దర్భాంగా బ్లాస్ట్ కేసులో నిందితుల నుండి ఎన్ఐఏ కీలక విషయాలను సేకరించారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్న నిందితులు విచారణ సందర్భంగా పలు విషయాలను  వెల్లడించారు. ఈ కేసులో  మరో వ్యక్తి ప్రమేయం ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.లష్కరే తోయిబా  నేత ఇక్బాల్ ఆదేశం మేరకు భారత్ లో పేలుళ్లకు మాలిక్ సోదరులు కుట్ర పన్నారని ఎన్ఐఏ గుర్తించింది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా నేత ఇక్బాల్  తో  ఖలీం అనే వ్యక్తి తరచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడినట్టుగా  దర్యాప్తు అధికారులు గుర్తించారు.

also read:దర్బంగా పేలుళ్లు: హైదరాబాద్‌లో హై అలర్ట్, స్లీపర్ సెల్స్‌పై నిఘా

హజీ సలీమ్ అనే వ్యక్తికి ఇంటర్నెట్ పై అవగాహన లేదు. దీంతో ఖలీం అనే వ్యక్తి సహాయం తీసుకొన్నాడని దర్యాప్తు అధికారులు తేల్చారు. పాకిస్తాన్ నుండి ఇక్బాల్ ఖన్నా సోషల్ మీడియా ద్వారా  వీరితో మాట్లాడినట్టుగా గుర్తించారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో పాటు అండర్ వరల్డ్ డాన్ మోమిన్ కూడ భారత్ లో పేలుళ్లకు కుట్రలో పాలుపంచుకొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఇండియాలో ఒక్కో బ్లాస్ట్‌కు మాలిక్ సోదరులకు  కోటి రూపాయాలను నజరానాగా ఇస్తామని ఆశ చూపారని దర్యాప్తులో వెల్లడించినట్టుగా సమాచారం.  2013లో నిందితులు పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా  కీలక నేతలను కలుసుకొన్నారు.

click me!