థర్డ్ వేవ్ దిశగా ప్రపంచం.. అప్రమత్తం కాకుంటే ముప్పు తప్పదు: వీకే పాల్ హెచ్చరికలు

By Siva KodatiFirst Published Jul 16, 2021, 8:24 PM IST
Highlights

ప్రపంచ దేశాలన్నీ థర్డ్ వేవ్ వైపుకు కదులుతున్నాయని చెప్పారు వీకే పాల్. పరిస్ధితి తీవ్రంగా మారే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించారు. డబ్ల్యూహెచ్‌వో హచ్చరికలను ప్రజలు పట్టించుకోవడం లేదని వీకే పాల్ ఆవేదన  వ్యక్తం చేశారు.
 

దేశంలో ఇంకా కరోనా ముప్పు తొలగిపోలేదన్నారు కోవిడ్ మేనేజ్‌మెంట్ గ్రూప్ ఛైర్మన్ వీకే పాల్. మూడో దశ ప్రమాదం పొంచివుందన్న ఆయన.. ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని సూచించారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు పాల్. ప్రపంచ దేశాలన్నీ థర్డ్ వేవ్ వైపుకు కదులుతున్నాయని చెప్పారు. పరిస్ధితి తీవ్రంగా మారే ప్రమాదం వుందని పాల్ హెచ్చరించారు. డబ్ల్యూహెచ్‌వో హచ్చరికలను ప్రజలు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో చాలా ప్రాంతాల్లో పరిస్ధితి అధ్వాన్నంగా మారిందని వీకే పాల్ స్పష్టం చేశారు. వైరస్‌పై డబ్ల్యూహెచ్‌వో వేదికలను బేఖాతరు చేయడం సరికాదని హెచ్చరించారు. 

Also Read:ఆగస్టులోనే థర్డ్ వేవ్.. ఐసీఎంఆర్ హెచ్చరిక..!

కాగా, ఐసీఎంఆర్ ఎపిడెమియాజీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం డైరెక్టర్ సమీరన్ పాండా ఆగస్ట్ లో థర్డ్ వేవ్ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు సడలించారు. ప్రజలు యధావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వైరస్ వ్యాపించి.. ఆగస్టులో థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేసింది ఐసీఎంఆర్. అయితే ఇది సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంటోంది. థర్డ్ వేవ్ వ్యాప్తికి సంబంధించి నాలుగు కారణాలను వివరించారు సమీరన్.

 

click me!